Thursday, April 10, 2014

తెలుగు సినిమా - పరాయి దేశం వాడి దృష్టిలో

ఇవాళ మధ్యాన్నం "రేసు గుఱ్ఱం" సినిమాకి అడ్వాన్సు బుకింగ్ కి టిక్కెట్లు కొందాం అని ఒక సినిమా హాల్ కి వెళ్లి రిటర్న్ లో ఇంటికి వెళ్ళడానికి ఒక టాక్సీ లో ఎక్కాను. దాని డ్రైవర్ ఒక బంగ్లా దేశి వాడు. మాటల్లో అడిగాడు " Kounsa film dekhne ja rahe ho saab?" నేను చెప్పాను, మా భాష (తెలుగులో) ఒక సినిమా అది అని. వాడికి తెలుగు అంటే ఏమిటో తెలియదు. (అలాగే వాడికి అరవం, మలయాళం కూడా తెలియదనుకోండి). సరే ఎదో క్లుప్తంగా హైదరాబాద్ ఆ రాష్ట్రం అలా ఎదో కాస్త తెలియచెప్పడానికి ప్రత్నించా...!!

ఇంతలో వాడు ఒక ప్రశ్న వేసాడు నాకు కళ్ళు బైర్లు కమ్మాయి ఆ ప్రశ్నకి..

"saab maine sunaa tha kuch bhasha filmo mein hero idhar maregaa toh villain udhhar utnaa door doosri manjil pe jaake girtha hai woh wala language hai kya?" [ అనువాదం: సర్ నేను విన్నాను ఎదో ఒక భాష సినిమాల్లో హీరో ఒక్క దెబ్బ కొడితే విలన్ చాలా దూరం పోయి భవనం ఇంకో అంతస్తు మీద పడతాడుట ఆ భాష సిన్మా నా?]

(నేను ఉద్యోగ రీత్యా అబూ ధాబి లో నివసిస్తున్నా, ఇక్కడ తెలుగు సినిమాలు పెద్దగా రావు, పెద్ద పెద్ద సినిమాలు వచ్చినా శుక్రవారం మధ్యాన్నం ఒక్క శో మాత్రం వేస్తారు ఊళ్ళో) 

3 comments:

  1. 'సినిమాని సినిమాలా చూడాలి', (సినిమాల్లో శ్రామికులు కాలుపాకల్లో సాయంత్రానికి కల్లుపాకల్లో తేలినట్లు) 'జనాలు తమ శ్రమానంతరం కొంచెం మనోరంజనార్ధం చూడ్డానికే సినిమాలు' లాంటి చెత్త డిఫెండింగులు చేసే ప్రేక్షకులున్నప్పుడు సినిమాలు ఇలాగే తయారౌతాయి. దీనికితోడు కమ్మోళ్ళందరూ facebookలో గ్రూపులుకట్టాలి, బాలకృష్ణ సినిమాని కనీసం ఒక్కసారైనా చూడాలి, రెడ్లు నితిన్‌సినిమాలు హిట్ చెయ్యలి, కాపులు చిరంజీవి కుటుంబం నుంచు ఎవరొచ్చిన్న వాడికి అభిమానులుగా మారాలి, వాళ్ళ సినిమాలు చూడాలి లాంటి నీతులున్న 'సభ్య'సమాజం మనది. ఇక్కడ అలాంటి సినిమాలుకాక ఇంకెలాంటివి విడుదలౌతాయ్?! But I don't think we are alone in this. Tamilians do the same thing too.

    ReplyDelete
    Replies
    1. చక్కగా చెప్పారు.

      Delete
  2. tamilam lo kastha realistic cinemalu baney vasthay.

    ReplyDelete