“ఏరా మొన్న నా పెళ్ళికి రాలేదే?” అడిగాడు శ్రీరాం కోపంగా.............”సారీ రా
ఒక ముఖ్యమైన పని ఉండి రాలేక పోయాను...ఈ సారి వస్తాలే” సంజాయిషీ ఇచ్చుకున్నాడు
రాజా.
పుండు మీద కారం చల్లినట్టు ఇంకా కోపం వచ్చింది శ్రీరాం కి. “అంటే నీ ఉద్దేశం
మళ్ళి మళ్ళి పెళ్ళిచేసుకుంటా అనా?”
ఒకసారి శ్రీరాం మొహం లోకి చూసి తాపీగా చెప్పాడు రాజా:”ఒరేయ్ నువ్వు విజయని
ప్రేమించి పెళ్లి చేసుకున్నావు కదా?”
“అవును”.
“మొదట్లో ఇంట్లో ఒప్పుకోరని మీరు ఇద్దరూ గుళ్ళో దండలు మార్చుకున్నారు కదా?
అప్పుడు నేను కాస్త భయపడి మీ గుళ్ళో పెళ్ళికి రాలేక పోయా...తర్వాత, గుళ్ళో
పెళ్ళికి గుర్తింపు ఉంటుందో లేదో అని మీరు రిజిస్ట్రార్ ఆఫీసులో పెళ్లి
చేసుకున్నారు కదా? అప్పుడు నన్ను సాక్షి సంతకాలకి రమ్మన్నారు కదా మీరు..కాని నాకు
కాస్త సహజంగా ఇలాంటి విషయాల్లో ధైర్యం తక్కువ కాబట్టి నేను మీ రిజిస్టర్
మ్యారేజికి రాలేదు. అన్ని విషయాలు సర్డుకున్నాకా మీ అమ్మా నాన్నా మామూలుగా
కార్డులు అవీ అచ్చేయించి ఇప్పుడు ఈ కళ్యాణ మండపం పెళ్లి చేసారు కదా? నిజంగా నేను
పని ఉండి రాలేకపోయా...ఇన్నిసార్లు ఏదో వంకన పెళ్లి చేసుకున్నవాడివి మళ్ళి ఇంకేదైనా
వంకన చేసుకోకపోతావా అని అలా అన్నా కాని వేరే ఉద్దేశం లేదు ఇంకోలా అనుకోవద్దు” నచ్చ
చెప్పే ప్రయత్నం చేసాడు రాజా. పక్కనున్న మేము నవ్వాపుకోలేక చచ్చాం.
అలాగే ఇంకోడు ఉన్నాడు మాకు....ఒకసారి వాడు హాస్పిటల్ కి ఏదో పని ఉందని
వెళ్ళాడు, కూడా మమ్మల్ని తీసుకెళ్ళాడు బైకు మీద . అక్కడ వాడు ఒక కళ్ళు చెదిరే అందంతో
ఉన్న ఒక నరసమ్మని చూసాడు.
ఇంక ఆపుకోలేక
ఆవిడ దగ్గిరకి వెళ్లి మనసులో ఉన్న మాట చెప్పేసాడు – తెగించి: “నాకు ఈ హాస్పిటల్ లో
మీ చేత సపరిచర్యలు చేయించుకునే అదృష్టం ఎప్పుడు వస్తుందో”. ఆ మాటకి ఆవిడ కళ్ళు
ఒక్కసారి ఆశ్చర్యంతో విప్పారినట్టయ్యి, ముసి ముసి నవ్వులు నవ్వుతూ......”ఒక్క
అదృష్టం చాలదండీ......ఒక అద్భుతం జరగాలి ............. ఎందుకంటే నేను ప్రసూతి
వార్డులో నర్సుని.”
ఒక్క అదృష్టం చాలదండీ......ఒక అద్భుతం జరగాలి ............. ఎందుకంటే నేను ప్రసూతి వార్డులో నర్సుని.”
ReplyDeleteఅదీ అలాగుండాలి...
ఏదో అలా.........
Deleteహహహ. మీరు చెప్పిని రెండొ జోకు ఎక్కడో చదివినట్టుగా ఉంది ;)
ReplyDeleteతప్పక చదివి ఉండవచ్చు అందులో సందేహం లేదు.........నర్సులు చాలా రకాలుగా మన జీవితాలని స్పృశించారు ముఖ్యంగా ఇలాంటి వాటిల్లో...
Deleteఅయినా ముళ్ళపూడి వెంకటరమణ గారి ప్రభావం నా మీద ...నాకంటే ఎక్కువగా ఉంటుంది (నిజ జీవితం లో కూడా)
ReplyDeleteఆవిడ చేత సేవలు చేయించుకోడానికి నిజంగా కూడా ఆ వార్డులో చేరగలడు :)
ReplyDelete