Thursday, February 21, 2013

హైదరాబాద్ - బాంబు దాడులు

 దాడులపై ముందే హెచ్చరించిన అమెరికా
(andhra Jyothi)
హైదరాబాద్, ఫిబ్రవరి 21 : భారత్‌లో ఉగ్రవాదదాడులు జరిగే అవకాశం ఉందని అమెరికా భారత్‌లోని తన పౌరులను రెండు రోజుల క్రితమే హెచ్చరికలు జారీ చేసింది. నిర్ధిష్టంగా ఎక్కడ దాడులు జరుగుతాయనే అంశంపై స్పష్టంగా పేర్కొనకపోయినా....భారత్‌లోని అమెరికా పౌరులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ముఖ్యంగా జనసమ్మర్ధం ఉండే రైల్వేస్టేషన్లు, రైళ్ళు, లగ్జరీ హోటళ్ళు, మార్కెట్లు, సినిమా హాళ్ళు; ప్రధానంగా పట్టణ ప్రాంతాల్లో దాడులకు అవకాశం ఉందని తెలిపింది.

"--- మబ్బెస్తే వానపడోచ్చు , మబ్బుల్లెకపోతే ఎండా కాయవచ్చు" అన్న వాతావరణ సూచన చెప్పినట్టు ఉంది ఈ వెర్రి వెధవ హెచ్చరిక. బాంబు దాడులు జరగచ్చు....జరిగితే సహజంగా జన సమ్మర్ధం ఉన్న చోటే జరుగుతాయి కాని ఎవరి ఇంట్లోనో వాళ్ళ మంచం కింద మడిగా జరగవు. ఈ ముక్క అమెరికా వాడు మనకి చెప్పక్కర్లేదు. చీమల పుట్టల్లా  జనం ఉండే మన ఇండియా లాంటి అత్యధిక జన సమ్మర్ధం ఉన్న దేశం లో గట్టిగా బుడగ పేలినా నష్టం చాలా ఎక్కువ సంఖ్యలో ఉంటుంది అన్న మాట నిర్వివాదాంశం.
ఇదిగో పులి అంటే అదిగో తోక అనే దిక్కుమాలిన concept తో   శవాల మీదా, పెళ్ళిళ్ళు, విడాకులు, అక్రమ సంబంధాల మీద జీవనం వెళ్లదీసే మన తెలుగు వార్తా చాన్నేళ్ళ కి అప్పుడే వాళ్ళ పరిశోధనలో ఎన్ని విషయాలు తెలిసేసాయో? 2012 లోనే ఉగ్రవాదులు హైదరాబాదు లో రెక్కి చేసేసారుట ...ఎక్కడెక్కడ రెక్కి నిర్వహించారో కూడా చెప్పేస్తున్నారు మన TV9 వాళ్ళు. ఇవాళ బాంబు పేలి ఇంకా కొన్ని గంటలవ్వకుండానే మనవాడికి క్రితం ఏడాది విషయాలు కూడా మనవాడికి అలా ఎలా తెలిసిపోతాయో? వీడు నిజంగానే ఇంత పుడింగ్ అయితే ఇప్పటిదాకా వీడు ఏమి పీకుతున్నారో? ఊరికే నోటికి వచ్చినట్టు వాగడం ఆపి ఏమి చెయ్యాలో ఆలోచిస్తే మంచిది అని నా అభిప్రాయం. వీడు వెళ్లి రాజకీయ నాయకులని ఊరికే కేలుకుతున్నాడు..అఫ్జల్ గురు ని ఉరితీసినందుకు ఈ బాంబులు పెల్చారనుకోవచ్చా? [ఈ మాట విని ఎవరైనా ముస్లిములు కాస్త ఆవేశం గా మాట్లాడితే దాని మీద పడి వీళ్ళు ఒక నాలుగు రోజులు కాలం వెళ్ళ దీయచ్చు అని కామోసు], అసలే పరిస్థితి బాగోనప్పుడు వీళ్ళు ఇలాంటి మాటలతో జనాల్ని కెలకడం అంత అవసరమా? 

అస్సలు బాధ్యత లేకుండా రక్తం..........కాళ్ళు చేతులు...ఎలా పడితే అలా చూపిస్తున్నారు. వీళ్ళని తగలెయ్యా...కొంచం కూడా బుద్ధి జ్ఞానం ఉందా అని? ఎంత సేపు రేటింగులే ఈ వెధవలకి. ముందు జనాల్ని ఎలా నియంత్రించాలి, పుకార్లు ఎలా అరికట్టాలి అనే విషయాలు గాలికి వదిలేసి వీడి గోల వీడిది, ఒళ్ళు మండిపోయింది చూస్తున్నంత సేపు.

ఈ దిక్కుమాలిన తెలుగు వార్తా చానెల్స్ మన రాష్ట్రానికి పట్టిన దౌర్భాగ్యం అని నా ప్రగాఢ విశ్వాసం. తెలంగాణా సమస్య ఇంత జటిలం కావడానికి కూడా వీళ్ళే పరోక్షంగా కారణం అని నా నమ్మకం.

2 comments:

  1. Media is really horrible and deserves contempt.

    ReplyDelete
  2. మీరు చెప్పింది నిజమే . YSR చనిపోయినపుడు కూడా దిక్కుమాలిన పాటలూ అవీ ఇవీ వేసి జనాలను భావోద్వేగాలకు లోనయ్యేలా చేసారు,మా ఇంట్లో వారం రోజులవరకు ఇంట్లో మనిషి పోయినట్టే ఫీల్ అయ్యారు.

    ReplyDelete