Thursday, August 9, 2012

జులాయి సినిమా రివ్యూ.


                                                      జులాయి సినిమా రివ్యూ.

ఈ మధ్య వచ్చే సినిమాల్లో పెద్దగా కధా, కాకరకాయా ఉండవు కాబట్టి నేను ఇప్పుడు ఈ సినిమా కధ గురించి పెద్దగా ఎమీ  ప్రస్తావించను.
మొత్తం సినిమాకి చోటా K నాయుడు/ శ్యాం K నాయుడు ఫోటోగ్రఫి ఒక పెద్ద హై లైట్ గా చెప్పుకోవాలి.
సినిమా హీరో: అల్లు అర్జున్. చాలా బాగా ఎనర్జిటిక్ గా చేసాడు సినిమాకి అతను ఒక హై లైట్ గా చెప్పుకోవచ్చు. కొన్ని పాటల్లో అతను వేసిన స్టెప్పులు చాలా కొత్తగా మంచి ఊపుని తెప్పిస్తాయి. ఇంకా ఫైట్ లు అవీ చెప్పనక్కర్లేదు.
హీరోయిన్: ఇలియానా. నాకు పెద్దగా ఎక్కడా కనబడలేదు ఈ అమ్మాయి. (అదేదో సైజు జీరో ట) జబ్బు చేసి లంఖణం చేసి లేచినట్టు ఉంది. ఒక పాటలో బావుంది అంతే. సెకండ్ హాఫ్ లో నిజంగానే కనబడదు.
విలన్: సోను సూద్. అతని లాగానే బాగా చేసాడు. కొత్తదనం పెద్దగా  కనబడలేదు.
అసలు విలన్: కోట శ్రీనివాసరావు. అలాంటి పాత్రలు కొన్ని వందలు చేసి ఉంటాడు. ఆ పాత్ర ఎక్కడో చూసినట్టే ఉంటుంది.
కామెడి: బ్రహ్మానందం – చాలా రోజుల తర్వాత కాస్త మంచి పాత్రలో ఉన్నాడు. కాస్తో కూస్తో నిడివి ఉన్న పాత్ర ఇది. ఎమ్మెస్ నారాయణ తనదైన సహజ సిద్దమైన హాస్యాన్ని పంచాడు, అక్కడక్కడ పంచ్ లతో అదరగొట్టాడు. అలీ ఒక్క మెరుపులా ఒక సీన్లో కనబడతాడు నాకైతే ఒక ఫది నిమిషాల దాకా నవ్వు ఆగలేదు. అలికి ఒక్క డైలాగు కూడా లేదు. ధర్మవరపు సుబ్రహ్మణ్యం ఒక  totally underutilized character.
దేవిశ్రీప్రసాద్ సంగీతం కుర్రకారుకి నచ్చవచ్చు.

ఇంక సినిమా గురించి వివరంగా: నా అభి ప్రాయం ఇంక త్రివిక్రమ్ - కధా, దర్శకత్వం అని పట్టుకు వేళ్ళాడకుండా తన unbeatable strong point అయిన డైలాగుల మీదే మనస్సు పెట్టి ముందుకు సాగాలి. జులాయి లో కద చాలా పేలవంగా ఉంది.అదేదో ఒక బ్యాంకు లో విలన్ అధిక వడ్డీలు ఆస చూపించి జనం చేత డబ్బు డిపాజిట్ చేయిస్తారు (తర్వాత దాన్ని దొబ్బెద్దాం  అన్న ప్లాన్ తో) జనం డబ్బు జమ చేసాకా ఆ డబ్బుని విలన్ ఒక మాస్టర్ ప్లాన్  దొంగిలిస్తాడు. ఆశ్చర్యం ఏమిటంటే ఈ electronic యుగం లో విలన్ పదిహేను వందలకోట్ల రూపాయలు - అన్ని నోట్ల కట్ల రూపంలో ఒక పెద్ద ట్రక్కు మీద వేసి తీసుకెళతాడు. వినడానికే నాకు ఏదోలా ఉంటె...చూడ్డానికి నవ్వు తెప్పించింది నాకు. ఆ ట్రక్కు డబ్బుని ఎక్కడో దాచేస్తాడు. మల్లి చివరాఖరున క్లైమాక్స్ లో ఆ లారీడు డబ్బుని మళ్ళి మోసపోయిన డిపోసిటర్ల దగ్గిరకి మన హీరో తీసుకు వస్తాడు అనుకోండి. మధ్యలో కొన్ని పంచ్ డైలోగులు, కాస్త హాయిగా నవ్వుకునే కామెడి తప్ప సినిమా రెండో భాగం చివరలో కాస్త విసుగుపుట్టిన్చినా పుట్టిన్చచ్చు.
అలాగని ఈ సినిమాని అంత వీజీ గా తీసిపడేయ్యడానికి లేదు సుమా. అల్లు అర్జున్ గురించి..........ఫోటోగ్రఫి గురించి...........కొన్ని స్టెప్పుల గురించి.............కాస్త కామెడి గురించి వెళ్లి చూసిరావచ్చు. లేదూ వద్దు అనుకుని ఊరుకున్నా పెద్దగా పోయేది ఏమి లేదు. ఇలియానా కి - కాస్త తిండి తిని మళ్ళి మునపటిలా తయారయితే తప్ప భవిష్యత్తు లేదు.

7 comments:

  1. Ileana ala tayaru avvadaniki karanam, she was simultaneously shooting for Barfi (Ranbir Starrer Bollywood film).

    Her de-glam in this movie was universally rejected.

    ReplyDelete
    Replies
    1. అవును శ్రీరాం అస్సలు బావోలేదు. లేకపోతే ఒకప్పుడు నేను ఇలియానా అంటే బాగా ఇష్టపడేవాడిని......పోకిరి, కిక్ ...ఇత్యాది లో

      Delete
  2. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం తప్ప సినిమా లొ గొప్పగా ఏమీ లేవన్నమాట, మీ రివ్యు బాగుందండి

    ReplyDelete
    Replies
    1. అవునండి రాజి గారు. కుర్రాళ్ళకి బాగా నచ్చుతుంది సంగీతం. డాన్సు లు బాగా వెరయిటి గా ఉన్నాయి....బన్నీ చితక్కోట్టేసాడు

      Delete
  3. manaki magics kavali...logics nachavu kada..

    ReplyDelete
  4. movie logic tho theesadu...bagundi..naku nachindi

    ReplyDelete
    Replies
    1. జనార్ధన రెడ్డి గారు..........సినిమా నచ్చితే మంచిదే కదండీ........ఒకసారి చూసేయ్యచ్చు అని నా అభిప్రాయం కూడాను............

      Delete