ప్రభాస్ ఒక నిజమైన “రెబెల్ మాస్ స్టార్” లా అవతారమెత్తిన చిత్రం - రెబెల్
సినిమా. చాలా రఫ్ గా, సరైన మొగాడిలా అతనిని చూపించే ప్రయత్నం చేసిన సినిమా - రెబెల్.
సినిమా మొదలయ్యిన కాస్సేపటి దాకా మనకి ఏమి జరుగుతోందో పెద్దగా అర్ధం అవ్వదు
కాని బాగా గ్రిప్పింగ్ గా ఉంటుంది.
సినిమా అంతా ప్రభాసే!!!
మొదటి భాగం చాలా బావుంది. హాయిగా నవ్వుకోవచ్చు. చాల రోజుల తర్వాత బ్రహ్మానందం
కి కాస్త మంచి నిడివి గల పాత్ర
ఇచ్చారు.బ్రహ్మానందం, ప్రభాస్, తమన్నా, కోవై సరళ అందరు కలిసి కాస్సేపు బాగానే
నవ్విస్తారు మనల్ని.
తమన్నా introduction పాట చాలా catchy గా తీసారు. పాటలో
బీట్లు foot tapping గా ఉంటాయి. ఈ పాటలో తమన్నా కి చాలా మంచి స్టెప్పులు,
కాష్ట్యూమ్స్ కూడా ఇచ్చాడు లారెన్స్. ఈ పాట చూసాక నేను ఒక నమ్మకానికి
వచ్చేసా......తెలుగు తెరకి ఇంక ఇలియానా అవసరం లేదు. తమన్నా వచ్చేసింది....పిట్టనడుముతో. ఇంక మన దర్శకులు హీరోలు అంతా ఆ నడుము చుట్టూ
తిరుగుతారు. http://www.youtube.com/watch?v=UqOlSp4qKjU
బ్రహ్మానందం – కోవై సరళ హాస్యం అనుకున్నట్టే ఉంటుంది. కోవై సరళ ఉన్నంతలో అరవ
హాస్యం బాగానే పండించింది. బ్రహ్మానందం, కోవై సరళ Hip – Hop dance steps ఊహించుకుంటేనే నవ్వొస్తుంది...ఇంకా చూస్తే..?? కొన్ని డైలాగులు – “అబ్బ
ఊరుకోండి సార్...మనదేశం లో యాభై శాతం నాలాంటి పోట్టున్నోళ్ళు (పొట్ట చూపించి)
బట్టున్నోళ్ళు (బట్ట తల చూపించి).” “నాపేరు నరస రాజు అండి ...అందరు నన్ను ‘నస’
రాజు అంటారు”. జెట్ ఎయిర్ వేస్ రిసెప్షన్ అమ్మాయి “నేను మీకు ఏ రకంగా సహాయ పడగలను”
అన్నప్పుడు, బ్రహ్మి “ ఓ యాభై వేలు అప్పుంది ఏమైనా సద్దుతావా”?
రెండో భాగంలో మన కమెడియన్ అలీ ఒక డాన్స్ మేష్టారిలా ఎంట్రి
ఇస్తాడు. ఉన్న పది నిమిషాలు బాగా నవ్వుకుంటాం. ఆ పదినిమిషాల్లో ఓంకార్ ‘అన్నియ్య’
మీదా, శివశంకర్ మాస్టర్ మీద కాస్సేపు జోకులు...
రెండో భాగం లో మీరు అనుకున్నట్టే కధ నడుస్తుంది. ఇంక
ఇందులో అన్ని లారెన్స్ ట్రేడ్ మార్క్ అరవ fightings, అరవ ఎమోషన్స్ చూపిస్తాడు. ప్రభాస్ ఎమోషనల్ సీన్లు కూడా బాగా చేసాడు
అనిపించింది. సెకండ్ హాఫ్ ఫ్లాష్ బాక్ లో వచ్చే దీక్షా సేథ్ ...ఫేస్ బుక్ లో ఉన్న
చాలా మంది ఆడపిల్లలు పెట్టుకునే ఒక అందమైన display profile picture లా ఉంటుంది...కస్సేపయ్యాక చచ్చిపోతుంది.
సినిమాకి కాస్త Hype create చేద్దామని కామోసు పాత తరం రెబెల్ స్టార్ కృష్ణం రాజుని ఒక పాత్రలో
తీసుకువస్తాడు లారెన్స్. అది మన హీరో గారి తండ్రి పాత్ర..సహజంగానే అది ఒక ఊరిపెద్ద,
ఉదాత్త మైన పాత్ర. అతన్ని చంపగానే మన హీరో గార రెబెల్ గా అయిపోతారు. ఒక ఫైట్ లో
ప్రభాస్ కండలు చాల బాగా చూపించారు మంచి ఎఫెక్ట్ వచ్చింది...నేల, బెంచి జనాల్లో
ఈలలు, కేకలు పుష్కలంగా వస్తాయి.
మొదటి భాగం చూసి ఇంటికి క్షేమంగా వచ్చెయ్యండి –
హాయిగా నవ్వుకుంటారు. మరీ యుద్ధాలు, రక్తాలు ఉన్నా పర్వాలేదు అంటే రెండో భాగం కూడా చూడండి.
యుద్ధాలు రక్తాలు మనకి కొత్త కాదు కాని, వాటితో పాటు వెనక్కాల అరవ మ్యూజిక్ = కొత్త
మనకి, నాకు కాస్తంత గుండె దడ వచ్చింది.
సినిమా బాగా ఆడి మంచిపేరు వస్తే అది మొదటి భాగం వల్ల.
ఒకవేళ ‘సినిమా పోయింది – వేష్టు’ అని పేరువస్తే అది రెండో భాగం వల్ల.
మొత్తం మీద ఇది ప్రభాస్ సినిమా.