ఉమ్మడి
కుటుంబాలు...... ahh..What does it mean? How do
they look like? “అమ్మా చూడవే
ఈయనేదో ఉమ్మడి or maybe something
like Gummadi అంటున్నారు?”
అవునండి ఈ కాలం పిల్లల దగ్గిర ఇలాంటి పదం వాడితే అలానే అంటారేమో సాధారణం గా. ఈ
రోజుల్లో అన్నీ nuclear families, ఎక్కడ చూసినా 2 + 1 మహా అయితే 2 + 2 అంతే – కుటుంబం అక్కడే
మొదలయ్యి అక్కడే పూర్తైపోతుంది.
అమ్మమ్మ - తాతగారు మేము |
మా చిన్నప్పుడు మేము ఒక ఉమ్మడి కుటుంబంలో పెరిగాము. మా తాతగారి ఇంట్లో
పెరిగాము. తాతగారు, అమ్మమ్మ, బామ్మగారు, మేనమామలు, వారి భార్యలు, వాళ్ళ పిల్లలు
కలిసి ఒకే ఇంట్లో ఉండేవాళ్ళం. తాతగారి చెల్లెళ్ళు వాళ్ళ కుటుంబాలు (ఉండేది వేరే
ఇంట్లో అయినా పొద్దున్న రాత్రి మకాం ఇక్కడే కబుర్లకి, కాలక్షేపాలకి). అరమరికలు
ఉండేవి కావు. ఎంతమంది వచ్చారు? ఎంతమంది తిన్నారు? ఎన్ని సార్లు వచ్చారు?ఎంత ఖర్చు
అయ్యింది? అసలు ఆ ప్రశ్నలు ఉత్పన్నమే అయ్యేవి కాదు. “అయ్యో వాడు/ అది ఈ సారి ఎందుకు రాలేదు అనుకునే రోజులు అవి.”
అదే ఇప్పుడు ఎవరూ ఇంటికి కూడా రావక్కర్లేదు, వాళ్ళనించి ఒక్క ఫోన్ వస్తే చాలు,
పరి పరి విధాల ఆలోచనలు, తర్క- వితర్కాలు. “అసలు
ఉన్నట్టుండి ఎందుకు చేసాడో? ఎం గొడవో ఏమిటో? డబ్బెమైన అడుగుతాడో? మన డ్రైవర్ ని
కాస్సేపటికి ఇమ్మంటాడో? మన కారే అడుగుతాడో? అసలు వాళ్ళని కాస్త దూరం పెడితే
మంచిది. మళ్ళి వెధవ మొహమాటాలు, మర్యాదలు, టైం వేష్ట్ – డబ్బులు బొక్క”. ఇవీ
ఠక్కున మనస్సులోకి వచ్చే ఆలోచనలు ఈ రోజుల్లో. అదే తాను ముక్కలు - మన నించి
మనపిల్లలికి అవే బుద్దులు అబ్బుతున్నాయి. దీనివల్ల మంచి చెడుల మాట ఎలా ఉన్నా మన
మీద negative stress చాల పడుతోంది. అవతలి
వాడిని తప్పించుకోడానికి ఎత్తులు పైఎత్తులు వేస్తూ ఎప్పుడూ ..ఏదో ఒక అబద్దం, ఏదో
ఒక కధ... ఎప్పటికప్పుడు తయారు చేసుకుంటూ దాన్ని అన్ని సందర్భాలలో అందరిముందు
అతికేలా ఉండేలా ప్రయత్నిస్తూ.............వెధవ జీవితం తెల్లారిపోతోంది. హాయిగా
మనసారా నలుగురితో కలిసి నవ్వుకుని ఎన్నాళ్ళయ్యింది మీరంతా? ఎందుకు ఇలా
బ్రతుకుతున్నాం?
ఒక బుల్లి ఫ్లాష్ బాక్ స్టొరీ....
మా ఇంట్లో వీధిలో ఉండే అరుగు (మా ఆఖరి తమ్ముడు వాసు) |
మా ఇంట్లో
బయట ఒక పెద్ద హాలు లాంటి అరుగు ఉండేది, దానిలో ఒక పది కుర్చీల దాకా ఉండేవి. అందులో
ఒకటి కాళ్ళు చాపుకుని కూర్చునే పడక కుర్చీ, అందరికి అది ఒక favourite కుర్చీ. పొద్దున్నే ఇంట్లో నాలుగో ఐదో తెలుగు/ ఇంగ్లీషు వార్తా పత్రికలూ
వచ్చేవి. తాతగారు ఆ పడక కుర్చీలో, మిగతా వాళ్ళు అనగా నేను నా తమ్ముళ్ళూ, పిన్నిలూ ,
మా మేనమామలు మిగతా కుర్చీల్లో సర్దుకుని, వార్తలు చదివేసేవాళ్ళం.
మా తాతగారి ఇంట్లో మేమందరం |
మా ఫ్రెండ్స్
– “ఒరే ఎప్పుడైనా మీ ఇంటికి రావాలంటే భయంగా ఉందిరా”
అనే వాళ్ళు. ఎందుకంటే, ఇంటికి వచ్చినప్పుడు వీధి అరుగు హాల్లో మా చిన్న మావయ్య కంట
వీళ్ళు బడితే వెంఠనె ఆయన వీళ్ళని లెక్కల్లో పైథాగరస్
సిద్ధాంతం, లేదా ఏదో ఒక ఆల్జీబ్రా సూత్రం అడిగే వారు. ఆ దెబ్బకి వాళ్ళు ఆయన
వీధి అరుగు మీద కనబడితే తప్పుకుని మళ్ళి
ఎప్పుడైనా వచ్చి నన్ను కలిసే వారు. సజహంగా ఆయనకి మహా వేళాకోళం, వెటకారం. ఎప్పుడూ ఏదో ఒక జోకు వేసి
అందర్నీ నవ్విస్తూ ఉండేవారు (ఇప్పుడూ ఉన్నారు). అలాగే మా బామ్మ గారు, ఆవిడకి అందరు
బామ్మల్లాగే దైవ భక్తి ఎక్కువ. పూజలకి పువ్వులు/ పెరట్లో మొక్కలు – ఆవిడ favourite
subject. దానికోసం ఇంట్లో ఎక్కడో అక్కడ ఒక మొక్క, చెట్టు,
పందిరి, పాదు, అంటూ ఇలా ఏదో ఒక project ఎప్పుడూ running లో ఉండేది. మాకు వెనక
కాస్త దొడ్డి ఉండేది అందులో మొక్కలు వేసేది ఆవిడ. మా ఫ్రెండ్స్ ఎవరు వచ్చినా
ఇంటికి, వాడికి ఒక చేగోడినో, జంతికలో కాస్త ఇచ్చి రెండు మామూలు కబుర్లు అడిగి,
వెంటనే “బాబూ కాస్త ఇలా వచ్చి ఆ బీర పాదు ఆ పందిరి మీదకి ఎక్కించు” అని పని
అప్పచెప్పేవారు. మా ఫ్రెండ్ ఎవరు కనబడితే వాడికి తప్పకుండా ఆవిడ ఈ facility ఇచ్చేవారు. ఒక్కోసారి ఒక్కో ఫ్రెండ్ – “ఇదిగో
వస్తున్నా అండి” అని జంప్ అయ్యేవారు కూడా. అలాంటప్పుడు ఆవిడ నాతో “ఒరే రావూ ఆ
వుండవల్లిగాడు ఉన్నాడే ఒఠి కబుర్లపోగురోయ్, ఇదిగో బామ్మగారు అంటాడు మళ్ళి కనబడడు.”
వేసంగుల్లో
అప్పుడు ఏ. సి. లు లేవు కాబట్టి, అందరం పొలోమని పైడాబా (రెండో అంతస్తు) మీదకి
పోయేవాళ్ళం పడుకోడానికి. దానికో పెద్ద డెకరేషన్ ఉండేది. పెద్దవాళ్ళు (తాతగారికి,
బామ్మగార్లకి) మడత మంచాలు, మిగిలిన మా అందరికి పరుపులు, చాపలు, జంపఖానాలు,
దుప్పట్లు, తలగడాలు, మంచినీళ్ళ చెంబులు, విసనకర్రలు. ఇవన్ని రాత్రి పడుకోబోయే
ముందు మొదటి అంతస్తునించి పోలో మని రెండో అంతస్తుకి మోసుకువెల్లడం. మధ్య రాత్రిలో
ఖర్మ కాలి ఎప్పుడైనా వర్షం వస్తే, గోలోమని అన్ని ఎత్తుకుని కిందకి దిగడం. భలేగా
ఉండేది...విసుగు విరామం ఉండేది కాదు. ఇప్పుడు కాస్త దాహం వేస్తే గ్లాసు మంచినీళ్ళు
ఎవరు ఇవ్వాలి అని ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకుంటున్నాం. (పెద్ద పని మరి?)
ఉమ్మడి కుటుంబాల్లో ఇంకొక సుగుణం ఏమిటంటే మనకి భోజనానికి ఢోకా ఉండేది కాదు. ఇంట్లో
ఒకరికి కోపం వస్తే ఇంకొకళ్ళు ఉంటారు మనకి ఫుడ్డు సంగతి చూడ్డానికి. ఒకళ్ళ కోపాలు,
అలకలు మనకి పెద్దగా effect ఇచ్చేవి కాదు ఆ
రోజుల్లో.ఉమ్మడి కుటుంబాల్లో ఇంకో పెద్ద సుగుణం, మా అందరికి అన్ని అందరితో
ఇచ్చిపుచ్చుకునే మనస్తత్వం అలవాటు అయ్యింది. There used to be lot of feel good factor in sharing whatever
we have. ఇప్పుడు అది ఎక్కడ కనబడడం లేదు. ఒక్క Facebook లో status లు share చేసుకోడం తప్ప.
"మన
జీవిత నాటకం చాలా చిన్నది...గడిచిపోయిన నిన్న మనది కాదు !! రాబోయే రేపు - ఒక ఊహ
మాత్రమె!! నిజంగా చూస్తామో లేదో..నిజంగా చూసేదాకా మనకి తెలియదు...!!! ఇంకా
మిగిలింది ఇప్పుడు, మన చేతుల్లో ఉన్న ఈ అద్భుత మైన ఎన్నో సుందర అనుభూతులున్న - వర్తమానం. అందుకే మన ఈ వర్తమానాన్ని హాయిగా ఆనందిస్తూ జీవిద్దాం అంతే
కాని ఏదో " ఇలా
ఈ జీవితాన్ని ఈసురోమని వెళ్ళదీయద్దు "
ఒక్క Facebook లో status లు share చేసుకోడం తప్ప.నిజంగానే చాలా కోల్పోతున్నాం అండీ..బోలెడు చిన్ననాటి సంగతులు గుర్తొచ్చాయి మీ వల్ల.ధన్యవాదాలు.
ReplyDeleteచాలా ధన్యవాదాలు సుభ గారు,
Deleteఒక్కోసారి మరీ బుర్ర లో తొలిచేస్తూ ఉంటుంది...అప్పుడు ఇలా.......!!!!
బావున్నాయండీ మీ జ్ఞాపకాలు.
ReplyDeleteధన్యవాదాలు జ్యోతిర్మయి గారు.
Deleteఅచ్చ గోదావరి భాషలో వ్రాస్తూన్న మీ "జ్ఞాపకాలు" చాలా బాగున్నాయి.
ReplyDeleteధన్యవాదాలు హరేఫల గారు.
Delete'అచ్చుగోదావరి' భాషలో రాసినా , మాకు అర్థం అవుతున్నాయే?! అలా ఎలా రాయగలిగారబ్బా!!? :)) :P
Delete:-) ఏదో మీకు అన్ని భాషలు వచ్చుకాబట్టి అలా అనుకూలంగా అయిపొయింది మీకు
DeleteStill i feel those moments i experienced in my childhood. I did not forget them to make memories. Thanks alot.
ReplyDeleteఅజ్ఞాత వ్యక్తీ గారు...మీరు ఎవరో తెలియలేదు...తెలిపి ఉంటె బావుండేది. అయిన మీ మెచ్చుకోలుకి ధన్యవాదములు
Deleteఆ అజ్ఞాతకు ఓ గుర్తింపు నివ్వదలిచాను, అది నాదే అని, నా అకౌంట్‌లో వేసేసుకోండి. ;) :)
Deleteహమ్మయ్య,
Deleteఇన్నాళ్ళు సరిగ్గా నిద్రపట్టలేదంటే నమ్మండి..!!!
చాలా థాంక్స్ అండి.
:)) ;)
DeleteNice read...
ReplyDeleteథాంక్స్ అండి కృష్ణ గారు
DeleteChaala bagundi
ReplyDeleteDadsu raasaru mari! :P :P
Deleteఅబ్బా చింక్స్ !!! థాంక్స్
DeleteThanks jeetu.
DeleteYour reflective posts take us back to golden bygone days. Thanks for reminding us of them. Keep writing sir.
ReplyDeleteచాలా థాంక్స్ కిషోర్ వర్మ గారు.మీలాంటి వాళ్ళ ప్రోత్సాహం ఉంటె రాస్తూనే ఉండాలనిపిస్తుంది
Deletenicely written, could correlate many instances
ReplyDeleteplease keep writing
మళ్ళి ఇంకో అజ్ఞాత వ్యక్తి.....
Deleteథాంక్స్ అండి (పేరు తెలియదు).
అందరికి ఇంచుమించు ఒకేలా అనుభవాలు ఉండచ్చు...వ్యక్త పరిచే విధానం లో తేడా ఉండచ్చు అంతే.
Bagundi andi :)
ReplyDeletethanks andi Mythoughts garu
Deleteనాకు కూడా దాదాపు మీలాంటి అన్ని జ్ఞాపకాలు ఉన్నాయి.అన్నీ గుర్తుచేశారు.Nice post:)
ReplyDeleteThank you Chinni garu.
Delete