ఎన్నారై లు ..హబ్బ ఆ మాటే ఎంత అందంగా ఉంటుందో? ఎన్నారైలు అంటే వాళ్ళకి అన్ని
తెలిసి ఉంటాయిట. అసలు డబ్బంటే వాళ్ళ దగ్గిరే ఉంటుందిట. ఇంగ్లీషు, చదువు, సంస్కారం
అన్ని వాళ్ళ దగ్గిరే నేర్చుకోవచ్చుట. శుభ్రంగా ఎలా ఉండాలి, ఇంగ్లీషులో ఎలా
నవ్వాలి. ఈత పువ్వు చూపించి తాటి పండు ఎలా కొట్టెయ్యాలి అన్ని వాళ్లకి వెన్నతో పెట్టిన విద్య ట. అందరు ఎన్నారైలు అలా అని కాదు నా ఉద్దేశం, ప్రతీ దాన్లో ఉన్నట్టే
ఇందులో కూడా కొన్ని exceptions ఉంటాయి. నా రాతలో నేను మరీ కొన్ని ఎగష్ట్రా characters ని మాత్రం పరిగణలోకి తీసుకున్నా. (the so called super/pseudo
rich or the neo rich NRIs only)
నా చిన్న తనం లో మాకు కూడా కొంత మంది ఎన్నారైలు ఉండేవారు చుట్టాల్లో. అలాగే
అక్కడా ఇక్కడా రోడ్ల మీదా కూడా చాలా మంది ఎన్నారైలని చూసే వాడిని. అప్పటినించి ఇప్పటిదాకా వాళ్ళని
చూసినప్పుడల్లా ఏదో ఒక కొత్త భావన కలగడం , ఒక కొత్త విషయం గ్రహించడం లేదా వాళ్ళ కొత్త
విన్యాసాలు తెలుసు కోడం జరుగుతూ ఉంటుంది. రోడ్ల మీద ఎన్నారైలని చూస్తే భలే కామెడి
సినిమా చూసినంత నవ్వొచ్చేది. బుడబుక్కల వాళ్ళల్లా మోకాళ్ళ దాకా వచ్చే లాగులు, ఆ
లాగుకి ఒక ఫది జిప్పులు, ఒక ఫది బెల్టులు, కొన్ని ఈకలు, పక్కనే పీకలు...ఇత్యాది.
చంకలో ఒక నీళ్ళ సీసా కాళ్ళకి హవాయి చెప్పులు, లేదా ఒక over size sandals, తల మీద ఒక టోపీ .. మెడలో ఒక కెమెరా....మొహం మీద ఎప్పుడూ ఫ్రీజ్ అయిపోయినట్టు ఆ
చెవి నించి ఈ చెవి దాకా సాగదీసినట్టు ఉన్న నవ్వు లాంటి పెదాలు. నవ్వు ఆపుకోలేక
పోయేవాళ్ళం ఈ వింత అవతారాలు ఈ వింత విన్యాసాలు చూడలేక. వచ్చినప్పుడల్లా ఫోటోలు తెగ
తీసేసే వాళ్ళు అందర్నీ కూర్చోపెట్టి.........మేమంతా వెర్రి వెర్రివేధవల్లా
పోజ్ లు ఇచ్చేసే వాళ్ళం, అంతే వాళ్ళు వెళ్ళిపోయే
వాళ్ళు. ఆ ఫోటోలు ఒక్కటి కూడా మాకు రాలేదు, ఇవ్వలేదు మేము చూడలేదు, అప్పుడప్పుడు అనుమానం వచ్చేది
అసలు అందులో రీలు ఉందా లేదా అని?(అప్పటికి digital cam లు ఇంకా రాలేదు లెండి).
ఏది పూర్తిగా చేత్తో తినకూడదుట, unhygienic ట. “You people eat lot of spicy food” – అయిదు ఏళ్ళక్రితం దాకా ఇక్కడే బండి మీద బజ్జీలు తిన్న
సరుకు అది. ఒక ఫ్రెండ్ రైల్లో వస్తుండగా ఒక ఎన్నారై పక్కనున్న వాడిని అడిగాడుట, “when is the rainy season in India” పాపం అక్కడే పుట్టి
పెరిగాడేమో అని అన్ని స వివరం గా చెప్పాడుట ఆయన. మాటల్లో మధ్యన విషయం తెలిసింది ఆ సదరు
ఎన్నారై గారు అక్కడికి వెళ్ళి ఒక అయిదు ఏళ్ళు మాత్రమె అయిందిట. చూసారా వరస?
సరే ఈ మధ్య కొన్ని కార్టూన్లు జోకులు కూడా వచ్చాయి
వీళ్ళ అతి ప్రవర్తన మీద. ఒక వయసుమళ్ళిన భర్త బట్టలు ఉతుకుతూ ఉంటాడు, ఆయన భార్య
గిన్నెలు కడుగుతూ ఉంటుంది....భర్త అంటున్నాడు భార్యతో...”అందుకే చెప్పాను అమెరికా
సంబంధాలు వద్దు అని ఇప్పుడు చూడు చేసుకున్నావు...ఇక్కడికి రమ్మన్నారు అని
ఎగురుకుంటూ వచ్చావు”. అలాగే ఇంకో దాంట్లో ...భార్య గిన్నెలు కడుగుతూ ఉంటుంది, భర్త
కింద నీళ్ళు తుడుస్తూ ఉంటాడు...భర్త అంటున్నాడు ..” వెధవ - అమెరికా లో ఉంటున్నాడుట
ఎవడి పని వాడే చేస్కోవాలట ? ఈ సారి మళ్ళి భోజనానికి వాళ్ళింటికి పిలవమను వెధవని...చీరేస్తాను”.
(ఇవన్ని ఏదో సరదాగా పంచుకోడానికే కాని ఎవరిని
ప్రత్యేకించి ఉద్దేశించినవి కాదు. నేను కూడా ఒక సాధారణ ఎన్నారైనే)