ఎన్నారై లు ..హబ్బ ఆ మాటే ఎంత అందంగా ఉంటుందో? ఎన్నారైలు అంటే వాళ్ళకి అన్ని
తెలిసి ఉంటాయిట. అసలు డబ్బంటే వాళ్ళ దగ్గిరే ఉంటుందిట. ఇంగ్లీషు, చదువు, సంస్కారం
అన్ని వాళ్ళ దగ్గిరే నేర్చుకోవచ్చుట. శుభ్రంగా ఎలా ఉండాలి, ఇంగ్లీషులో ఎలా
నవ్వాలి. ఈత పువ్వు చూపించి తాటి పండు ఎలా కొట్టెయ్యాలి అన్ని వాళ్లకి వెన్నతో పెట్టిన విద్య ట. అందరు ఎన్నారైలు అలా అని కాదు నా ఉద్దేశం, ప్రతీ దాన్లో ఉన్నట్టే
ఇందులో కూడా కొన్ని exceptions ఉంటాయి. నా రాతలో నేను మరీ కొన్ని ఎగష్ట్రా characters ని మాత్రం పరిగణలోకి తీసుకున్నా. (the so called super/pseudo
rich or the neo rich NRIs only)
నా చిన్న తనం లో మాకు కూడా కొంత మంది ఎన్నారైలు ఉండేవారు చుట్టాల్లో. అలాగే
అక్కడా ఇక్కడా రోడ్ల మీదా కూడా చాలా మంది ఎన్నారైలని చూసే వాడిని. అప్పటినించి ఇప్పటిదాకా వాళ్ళని
చూసినప్పుడల్లా ఏదో ఒక కొత్త భావన కలగడం , ఒక కొత్త విషయం గ్రహించడం లేదా వాళ్ళ కొత్త
విన్యాసాలు తెలుసు కోడం జరుగుతూ ఉంటుంది. రోడ్ల మీద ఎన్నారైలని చూస్తే భలే కామెడి
సినిమా చూసినంత నవ్వొచ్చేది. బుడబుక్కల వాళ్ళల్లా మోకాళ్ళ దాకా వచ్చే లాగులు, ఆ
లాగుకి ఒక ఫది జిప్పులు, ఒక ఫది బెల్టులు, కొన్ని ఈకలు, పక్కనే పీకలు...ఇత్యాది.
చంకలో ఒక నీళ్ళ సీసా కాళ్ళకి హవాయి చెప్పులు, లేదా ఒక over size sandals, తల మీద ఒక టోపీ .. మెడలో ఒక కెమెరా....మొహం మీద ఎప్పుడూ ఫ్రీజ్ అయిపోయినట్టు ఆ
చెవి నించి ఈ చెవి దాకా సాగదీసినట్టు ఉన్న నవ్వు లాంటి పెదాలు. నవ్వు ఆపుకోలేక
పోయేవాళ్ళం ఈ వింత అవతారాలు ఈ వింత విన్యాసాలు చూడలేక. వచ్చినప్పుడల్లా ఫోటోలు తెగ
తీసేసే వాళ్ళు అందర్నీ కూర్చోపెట్టి.........మేమంతా వెర్రి వెర్రివేధవల్లా
పోజ్ లు ఇచ్చేసే వాళ్ళం, అంతే వాళ్ళు వెళ్ళిపోయే
వాళ్ళు. ఆ ఫోటోలు ఒక్కటి కూడా మాకు రాలేదు, ఇవ్వలేదు మేము చూడలేదు, అప్పుడప్పుడు అనుమానం వచ్చేది
అసలు అందులో రీలు ఉందా లేదా అని?(అప్పటికి digital cam లు ఇంకా రాలేదు లెండి).
ఏది పూర్తిగా చేత్తో తినకూడదుట, unhygienic ట. “You people eat lot of spicy food” – అయిదు ఏళ్ళక్రితం దాకా ఇక్కడే బండి మీద బజ్జీలు తిన్న
సరుకు అది. ఒక ఫ్రెండ్ రైల్లో వస్తుండగా ఒక ఎన్నారై పక్కనున్న వాడిని అడిగాడుట, “when is the rainy season in India” పాపం అక్కడే పుట్టి
పెరిగాడేమో అని అన్ని స వివరం గా చెప్పాడుట ఆయన. మాటల్లో మధ్యన విషయం తెలిసింది ఆ సదరు
ఎన్నారై గారు అక్కడికి వెళ్ళి ఒక అయిదు ఏళ్ళు మాత్రమె అయిందిట. చూసారా వరస?
సరే ఈ మధ్య కొన్ని కార్టూన్లు జోకులు కూడా వచ్చాయి
వీళ్ళ అతి ప్రవర్తన మీద. ఒక వయసుమళ్ళిన భర్త బట్టలు ఉతుకుతూ ఉంటాడు, ఆయన భార్య
గిన్నెలు కడుగుతూ ఉంటుంది....భర్త అంటున్నాడు భార్యతో...”అందుకే చెప్పాను అమెరికా
సంబంధాలు వద్దు అని ఇప్పుడు చూడు చేసుకున్నావు...ఇక్కడికి రమ్మన్నారు అని
ఎగురుకుంటూ వచ్చావు”. అలాగే ఇంకో దాంట్లో ...భార్య గిన్నెలు కడుగుతూ ఉంటుంది, భర్త
కింద నీళ్ళు తుడుస్తూ ఉంటాడు...భర్త అంటున్నాడు ..” వెధవ - అమెరికా లో ఉంటున్నాడుట
ఎవడి పని వాడే చేస్కోవాలట ? ఈ సారి మళ్ళి భోజనానికి వాళ్ళింటికి పిలవమను వెధవని...చీరేస్తాను”.
(ఇవన్ని ఏదో సరదాగా పంచుకోడానికే కాని ఎవరిని
ప్రత్యేకించి ఉద్దేశించినవి కాదు. నేను కూడా ఒక సాధారణ ఎన్నారైనే)
"బుడబుక్కల వాళ్ళల్లా మోకాళ్ళ దాకా వచ్చే లాగులు, ఆ లాగుకి ఒక ఫది జిప్పులు, ఒక ఫది బెల్టులు, కొన్ని ఈకలు, పక్కనే పీకలు...ఇత్యాది."
ReplyDeleteBavagaru - mee padaalu super
చాలా థాంక్స్ రవి !!!
Deleteవెంకట్ గారు, మీరు చెప్పే విధానం బాగుంది. ఒక పోస్ట్ చదివిన తరువాత మిగిలిన వన్నీ కూడా చదివాను(కొన్ని సినిమా రివ్యూలు తప్పించి). ముఖ్యంగా రాజమండ్రీ విశేషాలు. మీరు నిజంగా కబుర్లపోగే :)
ReplyDeleteకిషోర్ గారు,
Deleteఎంకరేజ్మెంట్ కి చాలా థాంక్స్ అండి. (మీరు పొగిడారు అని అనేసుకుంటున్నా)
good
ReplyDeleteThanks andi.
Delete" వెధవ - అమెరికా లో ఉంటున్నాడుట ఎవడి పని వాడే చేస్కోవాలట ? ఈ సారి మళ్ళి భోజనానికి వాళ్ళింటికి పిలవమను వెధవని...చీరేస్తాను”."-- super....
ReplyDeleteహరేఫల గారు,
Deleteహ హ హ అది నా జోకు కాదు లెండి, ఒక కార్టూన్ ని నేను అలా చెప్పా అంతే
simply super ... chaala chamatkaaram gaa vundhi :)
ReplyDeleteasalu ee rojullo aithe NRI dress batti antha gaa gurthu pattalemu lendi ... mana vedhavalu alaage vunnaaru gaa ... kaani road daate tappudu kaani, auto koorchuni aa traffic choosi horetthuku poyi, bikka moham vundhi ante itte pasigetteyachhu vaadu NRI ani ... (true story ... happenned to me)
evari pani evaru cheskovadam ante ... oka saari 2007 lo first time vachinappudu variety gaa ... alavaatu lo naa plate nene kadigesaanu thinna ventane ... amma visukkundhi: "asalu kadagadam endhuku? paigaa aa kadagadamentii ...america lo kooda ilaa kaduguthaavaa ani " :)
అవును శశి,
Deleteనువ్వన్నట్టు మన కుర్రాళ్ళంతా ఇప్పుడు బట్టలు అలానే వేసుకుంటున్నారు. హ హ అవును ఇది అక్షరాలా నిజం ముఖ్యంగా రోడ్డు దాటేటప్పుడు భలే తెలిసిపోతుంది వీడు "ఇక్కడోడు కాదేహే" అని (NRI) అని. గిన్నెలు కంచాలు కడిగే అనుభవం ఇంకా నాకు కలగలేదులే..ఇంకా ఇంట్లో కాస్త మర్యాదలు అవీ బాగానే చేస్తున్నారు..నేను కూడా కడుగుతా అని మొహమాటానికి కూడా ఎప్పుడూ అడగలేదు ఇంకా.
హహహ బాగున్నాయండీ! "నేను కూడా ఒక సాధారణ ఎన్నారైనే" అంటే ఇప్పుడు మీరు మన రాజమండ్రీ వెళితే కొత్త గోదావరి నీళ్ళు ఎప్పుడు వస్తాయి లాంటి ప్రశ్నలు అడిగి, పానీపూరీని ఫోర్కు, చాకులతో తింటారా ఏమిటి ఖర్మ :):) (సరదాగా అన్నాలెండి)
ReplyDeleteరసజ్ఞ గారు,
Deleteకాస్త వెరైటీ గా ఉంటుందని ఎప్పుడైనా కాస్త ఎన్నారై కటింగ్ లు ఇద్దాం అంటే, మా ఇద్దరు అమ్మాయిలు నన్ను చితక్కోట్టేస్తున్నారు. నాకు ఎప్పటినించో ఒక బెర్ముడా వేసుకోవాలని కోరిక...ఒక సారి కొనుక్కున్నా కూడా.............అది వేసుకోనివ్వకుండా మా వాళ్ళు ఆ బెర్ముడా ని వీధిలోకి విసిరేశారు .."ఎదవ ఎన్నారై బిల్డ్ అప్ లు ఇవ్వద్దు అని".
అరేరే, బెర్మూడాతో రాజమండ్రి వీధిల్లో తిరగడం మరీ దారుణమేమో... మీ ఎన్నారైత్వాన్ని నిరూపించుకోవడం కోసం ఓ పని చేయొచ్చు:
Deleteతరవాణీ స్ట్రాతో తాగండి, అది చాలు. :)) ;)
"తర్పాని"??
Deleteకాదమ్మా తరవాణి అని మిడిల్ క్లాస్ వాళ్ళు పొద్దున్నే లేచి తాగుతారు - మనలాంటి వాళ్ళ కోసం కాదులే!!! (బాపు అందాల రాముడు సినిమాలో ధూళిపాళ కోటీశ్వరురాలైన హీరోయిన్ లతతో అంటుంటాడు.
అయినా ఇప్పుడు ఆంద్ర లో (కనీసం పట్టణాల్లో) ఎవరికైనా తరవాణి ఎలా చెయ్యాలో తెలుసా అని? మా బామ్మగారితోనే పోయింది అది.
By far the best of KABURLAPOGU. Chalanallatarvata tega navvu kunnam. Keep going.
ReplyDeletePedamav &Peddatta
థాంక్ యు పెద్దమావ్, పెద్దత్తా...........నవ్వించ గలిగితే అదే చాలు, నా బ్లాగు ఉద్దేశం కూడా అదే
DeleteIt is really funny Rao. I laughed a lot. It is a gift to make people laugh. Keep it up.
DeleteIt is really funny Rao. I laughed a lot. It is a gift to make people laugh. Keep it up. ఇంతకి ఈ మెసేజ్ పెట్టింది ఎవరో తెలియలేదు :(
DeleteThis is Gayathri. You really make people laugh. It is a great art. Your movie reviews are also very funny. But this is a classic one.
DeleteThank you Gayatri,
DeleteInitially, I thought so adi nuvve ani, kani malli anumanam vacchi adigaanu. Thanks again for the encouragement.
జ్యోతిర్మయి గారు థాంక్స్ అండి
ReplyDeleteహ్హ్వాహ్వాహ్వా
ReplyDeleteహ్హ్వాహ్వాహ్వా
NRIలైన ఆడాళ్ళు బతుకమ్మ పండగలో లాగా పట్టు చీరలతో నగలు, దిగేసుకుని, ఎంత పోజులుకొట్టినా, వంటపని, ఇంటిపని, ఇస్త్రీచేయడం, సాంకేతికంగా టాయిలెట్లు శుభ్రంగంచేసే నైపుణ్యం కలిగివుండటమే కాక, 'సేళ్ళూ (Sales మీద మంచి అవగాహన/పట్టు కలిగివుంటారన్నది నిర్వివాదాంశం. :P :))
అవునండి SNKR గారు.పట్టు చీరలు నగలు ఇక్కడకి వచ్చినప్పుడే వేసుకుంటారు. నాకు తెలిసిన ఎన్నారైలు చాల మంది ఉన్నారు, ఎవరైనా అయ్యో మా ఇంటికి వచ్చింది ఆడపడుచు అని ఒక చీర పెడితే అది ఇక్కడే ఇండియాలో వదిలేసి పోతారు. "అక్కడ వేసుకొను, ఇక్కడికి వచ్చినప్పుడు చూద్దాం లే అని." పోనీ ఇలా బట్టలు పెట్టె వాళ్లకి చెపుదామా అంటే? " ఆ మనం పెట్టడలుచుకున్నది పెట్టాం..కట్టుకుంటారో లేదో వాళ్ళ ఇష్టం" అని మూర్ఖంగా వీళ్ళు కూడా......షాపింగ్ లే కాదండీ, చిన్న చిన్న కొట్ల వాళ్ళతో వీళ్ళ బేరాలు ఆడడం కూడా చూడాలి పిచ్చ కామెడి గా ఉంటుంది.
Deletehmm.... NRI ల మీద సెట్టైర్ వేస్తున్న NRIగారనమాట మీరు!
ReplyDeleteమొదటి సారి చూస్తున్నా మీ బ్లాగ్...
జలతారువెన్నెల గారు,
Deleteఅవునండి నేను కూడా ఒక చిన్న చితకా ఎన్నారై ని.(ఇండియా పక్కనే ఉన్న దుబాయ్ ఎన్నారై ని)
చాలా బాగుందండి మీ బ్లా...లాగు...లు
ReplyDelete