చిన్నప్పుడు
ఎప్పుడో చదువుకునే రోజుల్లో అక్కడా ఇక్కడా వినేవాళ్ళం ...”ఇన్కంటాక్స్ తప్పించుకోడానికి ఏవేవో నష్టాలు వచ్చే
బిజినేస్సులు అవీ చూపిస్తారు” అని. అలా బహుశా ఈ ‘దేముడు చేసిన మనుషులు సినిమా’ కూడా అలాంటి బాపతే అని నా
అనుమానం. లేకపోతే మరీ అంత ఎటకారంగా ఎవరైనా ఎందుకు సినిమా తీస్తారు
చెప్పండి?పూర్తిగా చూడక్కర్లేదు, అసలు థీం వింటేనే తెలిసిపోతుంది ఎంత ఎట కారమో? అసలు
వారం కూడా ఆడదు అని. లేదు ఆ కారణం కాదు
అంటే మన పూరి జగన్నాధ్ కి గర్వం బాగా తలకెక్కైనా అయ్యుండాలి. “నేనేమి తీసినా చూసేస్తార్లే” అన్న తన గురుతుల్యులు రాం గోపాల్
వర్మ గారి పిచ్చి, వెర్రి తనం బాగా వంటబట్టి ఉండాలి.
అసలు సినిమాలో
ఏమి ఉంది? టూకీగా చెప్పాలంటే ఏమిలేదు. అసలు విషయం ఏమిలేకుండా రెండు ఘంటల పాటు
సినిమాని సాగదియ్యడం కూడా ఒక కళ. మొత్తం మీద సినిమాలో, రఘుకుంచే
మ్యూజిక్....శ్యాం కే నాయుడు ఫోటోగ్రఫి తప్ప ఇంకేమి లేదు. అన్నట్టు ఇంకో ముఖ్య విషయం ...ఇలియానా సైజు
జీరో అయినా కూడా ఇందులో చాలా బావుంది. మొన్న జులాయిలో లంఖణాలు చేసిన
ఇలియానాకి..ఇక్కడి ఇలియానా కి చాలా తేడా కనబడింది. ఆశ్చర్యం ఏమిటంటే? ఫోటోగ్రఫి
రెండు సినిమాలకి (జులాయి, దేముడు చేసిన
మనుషులు) - శ్యాం కే నాయుడే కాని ఇందులో ఎందుకు బావుందా అని ఆలోచిస్తే........ఆమె
ధరించిన కాష్ట్యూమ్స్ చాలా Trendy గా ఉన్నాయి. ఈ విషయం లో దర్శకుడికి మార్కులు ఇవ్వాలి.
కధ క్లుప్తంగా
.. వైకుంఠం లో అక్షయ తృతీయ రోజున విష్ణుమూర్తి (బ్రహ్మానందం) శ్రీ మహా లక్ష్మి
(కోవై సరళ) కూర్చుని ఉండగా, లక్ష్మి
దేవి ‘ఏదైనా ఒక మంచి కధ చెప్పండి స్వామి ‘ అని అడిగినప్పుడు, విష్ణుమూర్తి, కింద భూలోకం లో
జరిగే ఒక నిజ జీవిత కధ చూపిస్తా అని...మనకి సినిమా చూపిస్తాడు. బ్రహ్మానందం, కోవై సరళ బావున్నారు, మొట్ట మొదటి సారి భగవంతుడిని చూడగానే
ఫక్కున నవ్వొచ్చింది నాకు (క్షమించు తండ్రి, ఆపుకోలేకపోయాను) . ‘ఇండియా లో ఉన్న రవితేజ, బ్యాంకాక్ లో ఉన్న ఇలియనా ఎలా కలుస్తారు స్వామి ‘అని అడిగినందుకు..... ప్రభువు
చూడు...అని ఎమ్మెస్ నారాయణ అరటిపండు తిని తొక్క తీసి కింద పడవేస్తున్న సీను
చూపిస్తాడు. అక్కడినించి దాని మీద ఒకడు కింద పడి, వాడి మీద ఇంకోడు పడి ...అలా ఎక్కడెక్కడికో
పిచ్చిలా తీసుకుపోయి ఇంటర్వెల్ ముందు ఇలియానా రవితేజని రెండు కాళ్ళ మధ్య కొడుతుంది. “అమ్మా” అని బాధతో మెలికెలు తిరుగుతున్న
మన హీరో ని చూసి లక్ష్మి దేవి “ అయ్యో స్వామి చూసారా ఒక అరటి తొక్క ఎంత పని చేసిందో” అంటుంది. దానికి విష్ణు మూర్తి, “ఆ తొక్కదేముంది తొక్క పడెయ్యకుండా ఉంటె ఏమవుతుందో మళ్ళి చూద్దాం “అంటాడు. INTERVAL. మళ్ళి బొమ్మ వెనక్కి తిరిగి మళ్ళి ఎమ్మెస్ నారాయణ
అరటిపండు తినేదగ్గిరకి వెళుతుంది. మళ్ళి ఏదో ఒక పిచ్చి లింకులు అవి .............
మళ్ళి మనం బ్యాంకాక్ వచ్చేస్తాం అక్కడికే, మళ్ళి ఇలియానా రవితేజని కాళ్ళ మధ్య
తంతుంది.... ప్రకాష్ రాజ్ ని అంత చెత్త పాత్రలో అంత చెత్త నటనతో చూడడం నాకు ఇదే
మొదటి సారి. అసలు అలాంటి పాత్ర ఎందుకు చెయ్యాల్సి వచ్చిందో అతనికి ......., ఏమైనా
మొహమాటాలో, బెదిరింపులో తెలియదు. రవితేజని
భరించడం కాస్త కష్టమే ఇందులో, సెటిల్మెంట్లు అవీ చేస్తున్తాదుట ఇందులో. ఒక పోలీసు సర్కిల్ ఇన్స్పెక్టర్ – సుబ్బరాజు కి ప్రకాష్ రాజ్ తో సెటిల్మెంట్
చెయ్యడానికి బ్యాంకాక్ వెళతాడు (వినడానికి కాస్త వేళాకోళంగా ఉంది కదా?). సినిమా
మొత్తానికి కాస్త బావున్న క్యారెక్టర్స్ : అలీ , Fish వెంకట్ (సాధారణం గా చిన్న సైడ్ రౌడీ పాత్రలు వేస్తుంటాడు). సుబ్బలక్ష్మి పాట బాగా క్యాచీ గా ఉంది. ఫైట్లు అవీ
మామూలే, పెద్దగా చెప్పుకోడానికి ఏమి లేదు.
చూస్తుండగానే సినిమా అయ్యిపోయింది అనేస్తారు. మరీ మానసిక వత్తిడిలో ఉంది ఇంట్లో ఉండలేని
పరిస్థితి అయితే తప్ప ఈ సినిమాకి వెళ్ళడం అంత శ్రేయస్కరం కాదేమో ఆలోచించుకోండి.
COMMENT RAYAKA POTHE FEEL AVUTHARANI RASTNNANU ....
ReplyDeleteYEM MOVIE IDHI ... YEPPUDO VACHHI TAMIL 12b , antha kante mundhu vachhhina ( inspiration for 12b ) Run lola run ..
15 years back oka director ki thought vaste ..ippudu mana P.p .PURI adhi baga copy chesi thisadu .
Anonymous నిజంగా మీరు కామెంట్ రాయకపోతే చాలా ఫీల్ అయ్యేవాడినే..!!! మన క్రియేటివ్ దర్శకులు 15 ఏళ్ళు ఏంటి? యాభై ఎల్లైనా సరే వెనక్కి వెళ్ళి కధా వస్తువు 'సం'గ్రహించగలరు.
Deletemotthaaniki "thokka lo" subject anna maata..nice review rao gaaru..as awlays keep posting more..
ReplyDeleteThanks Nadu...!!!
Deleteతొక్కలో సినిమా అని తేల్చిపారేసి నా జేబుకి చిల్లు పడకుండా కాపాడారు. ఈ సినిమా చూడాలని రిలీజ్‌కి ముందు అనుకున్నాను. థాంక్స్.
ReplyDeleteపూరి జగన్నాధ్ కి కోపం వస్తుంది కాని, సమాజానికి సేవ చెయ్యాలన్న లక్ష్యంతో ఇలా చెప్పక తప్పటం లేదండి కృష్ణ గారు.
Deleteపూరీ జగన్నాధ్ తిక్క గురించి "బిజినెస్ మ్యాన్" చూసినప్పుడే అర్ధమయింది. ఇప్పుడు మరింత తిక్కతో తొక్కలో సినిమా చేసాడన్నమాట. తీసేవాడికి లేని బుద్ది చూసే వాడికయినా ఉండాలి కదా.. (సారీ... మిమ్మల్ని కాదండోయ్)... మమ్మల్ని కాపాడినందుకు థ్యాంక్స్.
ReplyDeleteఏదో అంతా మీ దయ ఎస్పీ జగదీష్ గారు
Deletepoori tikka gurinchi, paityam gurinchi janaalaku inkaa baaga ardham ayyelaa idi teesaadu....Business Man-2 ani peru pettalsindi....tikka kudiredi (janaalaki)
ReplyDeleteహ హ కానీ అలా కుదరదు లెండి ఎందుకంటే ఇందులో బిజినెస్స్ మెన్ అన్ని భూతులు తిట్లు లేవుగా మరి?
Deleteఅయితే బూతుల డోసు సరిపోక సినిమా ఫ్లాపయ్యిందా?
Deleteచాలా థాంక్సండి బ్రతికించారు
ReplyDelete