1984 లో రాజమండ్రి నించి - కలకత్తా వెళ్ళడానికి "కోరమాండల్ ఎక్స్ ప్రెస్ " లో కూర్చున్నా, కిటికీ పక్క సీటు (సైడ్ లోయర్), గుండెల్లో ఏదో తెలియని భయం బిక్కు బిక్కు మంటూ ఉంది. దానిక్కారణం నాకు అస్సలు బెంగాలి రాదు, కలకత్తా లో అంతా బెంగాలీయేనట ! చుట్ట పక్కాలు అంతా తెగ భయపెట్టేసారు.
రైలు సామర్ల కోట వచ్చేసరికి ఒకాయన నా ఎదురుగా వచ్చి కూర్చున్నారు. మనవాడు వస్తూనే సుడిగాలిలా వచ్చేసాడు , అంతా హడావిడి, నన్ను ఒక పక్కకి జరిపెసాడు ..సామాను సర్దేసాడు. కాస్త స్థిమిత పడగానే ఇంక మొదలు:
"మీరెక్కడిదాకా నండి?" చెప్పా "కలకత్తా"..."ఆయ్ నేను అక్కడికే అండి, నా పేరు అప్పలసామండి, ఆయ్ మాది ద్వారపూడండి". ఓహో అనుకున్నా."ఇంతకు ముందు ఎప్పుడైనా ఎల్లారా?" "లేదండి ఇదే మొదటిసారి" ఆహాయ్ పర్లే మంచూరే!! ధైర్యం చెప్పాడు నాకు . "మనకి బెంగాలి యావైనా వచ్చేటండీ"? నాకు కొచ్చిను. అబ్బే లేదండి "అస్సలు" రాదు అన్నా. అలా ఏదో చెపుతూ పోతూ ఉన్నారు నేను వింటూ నిద్రలోకి జారుకున్నా..
తెల్లారి కలకత్తా లో దిగాము .
మనోడే నన్ను గుంజుకుని తీసుకు పోయాడు ఒక హోటల్ కి. మేఘ దూత్ – దానిపేరు.
రూములోకి వెళ్ళి కాస్త స్థిమిత పడ్డాకా....రూమ్ సర్విస్ వాడిని పిలిచాడు మన అప్పల సామి. రూం బోయ్ రాగానే మొదలు మనవాడు: “టిఫిన్ ఏముందయ్యా మన దగ్గిర?” (సుద్ద తూ గొ జీ తెలుగులో) కుర్రాడు చెప్పాడు లిస్టు ..ఇడ్లి, వడ, దోస వగైరా ..”సరే మంచి వేడి వేడిగా రెండు ప్లేట్లు పూరీ పట్రా అని” పంపించేసాడు. నేను చాల ఆనంద పడిపోయా, కాస్తంత ఆశ్చర్యపోయా కూడా . కలకత్తాలో తెలుగు వాళ్ళు పని చేసే హోటల్ ఉందే అని, అదే మాట మా అప్పలస్వామి గారితో కూడా అనేసా.
“తెలుగోడా నా మొహమా “ ఆడు శుద్ద బెంగాలి వోడు ఆదికి తెలుగు రాదండి అన్నాడు. “మరి మీరు వాడితో తెలుగులో మాట్లాడేస్తున్నారు?” అన్నా. “ఓహో అదా మనం ఏమన్నాం అండి? ఒరేయ్ మీ దగ్గిర టిఫిను ఏంటి” యే భాషైన టిఫిను టిఫినే కదా? ఆడు పూరీ అన్నాడు , నేను రెండేళ్లు చూపిచ్చి రెండు ప్లేట్ పూరీ అట్టుకు రా అన్నా....అంతే ఆడికి అర్ధం అయ్యిపోయింది..ఎల్లాడు - మీకు నాకు పూరిలట్టుకొచ్చాడు. దీనికి పెద్ద భాష రావాలేటండి? అన్నాడు. అతని లోక జ్ఞానానికి నాకు నోట మాట రాలేదు.
ఇంత చదువు చదివి, ఇన్ని భాషలు వచ్చి నాకు బెంగాలి రాదు అని భయపడుతున్న నాకు గీతోపదేశం లా చెప్పాడు మా అప్పలస్వామి. అతను ‘నిశాని’ అయినా ఎక్కడ తోణుకు బెణుకు లేదు మనిషిలో, వదిలేస్తే ప్రపంచాన్ని చుట్టేసి రాగలడు.
చాలా బాగుంది మీ టపా. నిజమేనండీ ధైర్యలక్ష్మి ఉంటే మిగతా అన్ని లక్ష్మిలూ ఉన్నట్టేనట. కొన్నిటికి భావమే ప్రధానం భాషతో పని ఉండదు ఇక్కడ అమెరికాలో కూడా ఎన్నో చూసా తెలుగు మీడియం కుఋఋఆడు తొణకక బెణకక చక్కగా అన్నీ చక్కబెట్టేస్తున్నాడు. [::0
ReplyDeleteచక్కగా చెప్పారండీ! ఎక్కడుంటే ఏమి? ఎంత చదువుకుంటే ఏమి? లోకజ్ఞానంతో నెట్టుకు రాగాలగాలి ఎలాంటి పరిస్థితులయినా!
ReplyDeleteనందు గారు మీ ప్రోత్సాహానికి చాలా కృతజ్ఞుడిని.
ReplyDeleteరసజ్ఞ గారికి ఈ టపా నచ్చినందుకు సంతోషం.వీలున్నప్పుడు ఇక్కడికి వస్తూ ఉండండి. మా నందు లాగా నన్ను ప్రోత్సాహించినట్టు ఉంటుంది నాకు
ReplyDeleteచాలా చక్కగా వుందండి రావుగారు, ఇది పూర్తిగా మీ కల్పితమేనా, లేదా మీ అనుభవం కూడా కాస్త రంగరించి రాసారా? నిజంగానే ఎంత చదువున్నా లోకజ్ఞానం, సమయస్పూర్తి లేకపోతే ఈ ప్రపంచం లో బ్రతకటం కష్టం. ఇవి రెండూ వుంటే ఇక ఈ ప్రపంచంలో సాధించాలేనిదంటూ ఏదీ వుండదేమో! ఈ సందర్భంలో నాకొకటి జ్ఞాపకం వస్తోంది. విదేశాల్లో ఈ చైనీస్, కోరియన్స్ లాంటి వాళ్ళు, అసలు పొట్ట పొడిస్తే ఒక్క ముక్క ఇంగ్లిష్ రాకపోయినా (ముఖ్యంగా ఆడవాళ్ళు), బ్రహ్మ౦డ౦గా మేనేజ్ చేసేస్తూవున్నారు. వాళ్ళు చెయ్యని పనులు లేవంటే నమ్మండి. వాళ్ళ ధైర్యానికి నాకు చాలా ముచ్చటేస్తుంది. మీరు ఇంకా ఇలాంటి మంచి మంచి బ్లాగ్స్ రాసి మమ్మల్నందరినీ ఆనందింపచేయాలని ఆశిస్తున్నాను.
ReplyDeleteచాలా థేంక్స్ వీణ గారు. లేదండి పైన చెప్పిన విషయం నాకు నిజంగా జరిగినదే. వీలైనంత వరకు నా బ్లాగుల్లో నిజ జీవితానికి సంబంధించిన విషయాలు చెప్పడానికి ప్రయత్నిద్దాం అనుకుంటున్నా...చూడాలి ఎంత దాక సఫలం అవ్వగలనో?
Deleteబాగుందండీ , ఇప్పుడు మీకు అప్పలసామి ని మించిన లోకజ్ఞానం నేర్చేసుకున్నారని తెలుసు ...మరి బ్లాగు ప్రయాణం ఇంకా బాగా సాగాలని ఆశిస్తూ
ReplyDeleteచాలా కృతజ్ఞుడిని ఉదయశ్రీ గారూ, మీ అభిమానానికి.
Deleteఅన్నయ్య, వీడిగురించి నువ్వు చెప్పావు. వీడేనా, సిలిగురి లో పౌల్ట్రీ ప్రొడుక్ట్స్ అమ్మడానికి ప్రతి నెల వేల్తాడుట అని చెప్పావు? Vasu.
ReplyDeleteఅవును వాసు ఈ అప్పలస్వామీ అతనే!!!
Deleteమీ సరికొత్త టపా నుంచి మొదటి టపా వరకూ మొత్తం చదివేశాను. బావున్నాయండి.
ReplyDeleteChinni garu,
DeleteChala thanks andi, meeku anni nacchinanduku.
సత్తిరాజు గారు ...ఈ విడిది లో బస ఈ రోజే ..చాలా హాయిగా ఉంది కబుర్ల తో..
ReplyDeleteమీకు నచ్చింది ............నాకు చాలా ఆనందంగా ఉంది అండీ.
Deleteసత్తిరాజు గారు ...ఈ విడిది లో బస ఈ రోజే ..చాలా హాయిగా ఉంది కబుర్ల తో..
ReplyDelete