“రాజన్న” – విజయేంద్ర ప్రసాద్ ( S. S. రాజ మౌళి వాళ్ళ నాన్న) దర్శకత్వం .
సినిమా గురించి: చాలా ఏళ్ళ తర్వాత మరీ గుండెలు పిండేసే సెంటిమెంట్ తో ఉన్న సినిమా చూసాను. మనసుకి చాలా నచ్చింది కాని బయటికి వచ్చిన ఒక అరఘంట దాకా అ బరువెక్కిన గుండె ఇంకా తేలిక పడ లేదు.
మూల కదా వస్తువు, వాళ్ళ ఊరిని (ఆదిలాబాద్ జిల్లా – నేలకొండపల్లి) నీ బాధిస్తున్న నిజాం తొత్తుల నించి విముక్తి కలిగించమని ఒక 7-8 సంవత్సరాలు వయస్సుకల పిల్ల ..కాలి నడకన డిల్లి నడుచుకుని వెళ్ళి అప్పటి ప్రధాని నెహ్రు గారిని కలవడానికి వెళ్లడం. ఈ పిల్ల మన దివంగత హీరో రాజన్న కూతురు (ఆ విషయం ఆ అమ్మాయికి తెలియదు ముందు)
మొదటి భాగం చాలా బాగా వచ్చింది. మొదటి భాగం హీరోయిన్ - ఒక చిన్న పిల్ల చాలా చాలా బాగా చేసింది. కళ్ళల్లో చక్కటి హావ భావాలు, నవ్వితే చాలా బావుంది అమ్మాయి. తెలంగాణా జానపద గీతాలు, సందర్భానుసారంగా పాటలు చాల బాగా నప్పాయి. కీరవాణి సంగీతం సందర్భోచితంగా చాలా హాయిగా అనిపించింది. కాని ఒక్కటి మళ్ళి గుర్తుకు వచ్చే పాట వినబడలేదు.
ఉన్న కాస్సేపైనా స్నేహ బాగా ఉంది.
ఆ చిన్న పిల్ల పెంపుడు తాత పాత్ర వేసిన నటుడు చాలా బాగా నటించాడు. ఆ పిల్ల - ఈ తాత కలిసి నన్ను చాలా ఏడిపించారు. ఒక రుమాలు పూర్తిగా తడిసిపోయింది. పక్కన కూర్చున్న వాళ్ళు నవ్వుకుంటారేమో అని భయం కాని, కన్నీళ్లు ఆగలేదు, నా system malfunction ఏమో తెలియదు.
రెండో భాగం కాస్త నెమ్మదించింది. అంతా మామూలు గా విప్లవం, దేశభక్తి మాటలు, తిరుగుబాటు...కత్తులు, తుపాకులు..అన్ని షరా మామూలే. మన నాగార్జున సరిగ్గా మొదటి భాగం చివరిలో మొదటి సారి వస్తాడు...(ఇతని పాత్ర flash back) అతను పోయాకా మళ్ళి మనం వర్తమానం లోకి వస్తాం. మన పిల్ల డిల్లి చేరుకొని అక్కడ కాస్త కష్టం అనుభవించి చివరికి నెహ్రు గారిని తన పాటతో మెప్పించి ..తన ఊరిని నిజాం తొత్తుల దాస్యం నించి విముక్తి కలిగిస్తుంది.
ఒక్కసారి చూస్తే చూడచ్చు..కాస్త దేశభక్తి గుర్తొస్తుంది. అందరు చాలా బాగా నటించారు. విజయేంద్ర ప్రసాద్ దర్శకత్వం బావుంది. “Action scenes by S. S. Rajamouli” అని build up ఇచ్చినంత ఏమి లేదు సినిమాలో. బహుశా పబ్లిసిటీ కి వాడుకుని ఉండచ్చు. ఫోటోగ్రఫి బావుంది.
అన్నపూర్ణ స్టూడియో వారికి పెట్టుబడి వెనక్కి వచ్చిన రావచ్చు లేదా కాస్తో కూస్తో పోవచ్చు. మొత్తం మీద ఒక మంచి సినిమా చూసా అన్న భావన కలిగింది..కాని మనస్సు మాత్రం చాలా బరువెక్కిపోయింది. (ఒక మంచి బ్రహ్మి కామెడి చూస్తే కాని బరువు దిగదు (ఏదైనా పాత DVD పెట్టి చూసేయ్యాలి రాత్రికి)
రేటింగ్: 2.75/ 5 (3 ఇచ్చిన కూడా పర్వాలేదు)
No comments:
Post a Comment