రెండు వేల సినిమా హాళ్ళలో ఒకేసారి విడుదల అంటే పెద్ద ఆశ్చర్యం లేదు. “దీపం ఉండగానే ఇల్లు చక్క బెట్టుకోవాలి”. ఆలస్యం అయ్యి ఆ నోట ఈ నోట విషయం బయటకి తెలిసిపోతే......పెట్టుబడికే మోసం రావచ్చు. నిర్మాతల ఆలోచన అదే కావచ్చు. తప్పులేదు కూడాను.
మహేష్ బాబు: అనుకున్నట్టే అతనే సినిమాకి సర్వస్వం. అతను ఒక్క ఫ్రేము లో లేకున్నా సినిమా పూర్తిగా పోయి ఉండేది. కానీ ఆట గాడు బాగా పరుగెడతాడు అని అతన్ని అదే పనిగా పరుగెత్తిస్తే...కొన్నాళ్ళకి మామూలుగా కూడా నడవలేకుండా పోతాడు అన్న ఆలోచన మన దర్శకులకి ఎందుకు రావటం లేదో? సినిమాలో ఇంకేమి విషయం లేదు .
కాజల్: ఒక హీరోయిన్ కావాలి కాబట్టి ఒక అమ్మాయి నీ పెట్టినట్టు ఉంది, ఆమె రోల్ కట్ చేసి పక్కన పెట్టినా సినిమాకి పెద్ద తేడా ఏమి ఉండేది కాదు.
విలన్: పెద్దగ చెప్పుకోడానికి ఎవ్వరు లేరు ఒక రకంగా అందరు విలన్లే. సరే కాదు కూడడు అని మీరు వాదిస్తే “ప్రకాష్ రాజ్” పేరు మీరు అనుకోవచ్చు. కాని అతన్ని సరిగ్గా వాడుకోలేక పోయాడు పూరీ.
మొదటి భాగం:
టైటిల్స్ బాగా ఉన్నాయి. మంచి గ్రాఫిక్స్ మంచి back ground music for titles. భలే ఉంటుంది సినిమా అనుకుంటాము.
హీరో ముంబాయి వచ్చి తన బిజినెస్స్ మొదలు పెట్టేస్తాడు..అలా మొదలు పెట్టె సన్నీ వేషాలు మరీ వేళాకోళం గా ఉంటాయి. Scenes చూసి అంత convince అవ్వడం కాస్త కష్టం.
మహేష్ బాబు మొదటి సారి కాజల్ నీ కలిసే సన్నివేశం చాలా బాగా తీసాడు పూరీ. పెద్దగా ఏమి విషయం లేకుండా అక్కడక్కడ కాస్త బోర్ గా మొదటి భాగం సాగిపోతుంది......ఎంత సేపు అనుకుంటూ ఉండగా – దర్శకుడు మనకి Interval ఇస్తాడు.
రెండో భాగం:
అలాగే సాదా సీదాగా సాగుతూ ఉంటుంది..ఉన్నట్టుండి మన హీరో కి ఒక బుల్లి Flash back ఉంది అని గుర్తుకి వస్తుంది – పూరికి . అందులో ఏదో కాస్త పగ అవన్ని కనబడతాయి...అదే మన సినిమాకి అసలు మూల కారణం అట.
రెండో భాగం లో మన పూరీ డైలాగులు అక్కడక్కడ బాగా పేలతాయి. అంతకు మించి నాకు విషయం కనబడలేదు. పొద్దున్న నించి సాయంత్రం దాకా Facebook మీద కూర్చుంటే ఒకటో రెండో మంచి Ctrl C Ctrl V – quotes కనబడతాయి అలానే ఇందులో మంచి కామెడి బిట్లు ఒకటో రెండో ఉంటాయి అంతే.
“రెండు కోట్ల రూపాయల Austin Martin Car ఇస్తే కూడా నువ్వు పడవా? నేనైతే Two wheeler ఇచ్చినా పడిపోతాను” (హీరోయిన్ పక్కన ఉండే ఒక చెలికత్తె అంటుంది హీరోయిన్ తో)
ధర్మవరపు సుబ్రహ్మణ్యం ది “ దూకుడులో” చాలా పెద్ద రోల్ కింద లెక్క దీనితో పోలిస్తే. ఎందుకు అతన్ని తీసుకున్నారో తెలియదు.
అన్ని పాటలు చిత్రీకరణ చాలా బాగా తీసాడు. “సారోస్తారోస్తారు” పిల్లా Chao” చాలా బాగా తీసాడు పూరీ. మహేష్ అదిరాడు పాటల్లో.
రచ్చ రచ్చ ... గోల గోల చేసిన మహేష్ – కాజల్ liplock scene, so so గా ఉంది. అంత సన్నివేశం అడిగినట్టుగా ఏమి లేదు ..మహేష్ బాబు అడిగినట్టుగానో, లేదా పూరీ కావాలి అన్నట్టుగానో ఉంది, అది కూడా సరిగ్గా లేదు మొహమాటం గా పెట్టుకున్నట్టు ఉంది (దూకుడు కూడా అంతే కదా?)
మొత్తం మీద సినిమా - నాలాంటి “వీర మహేష్ బాబు Fans “ ఒక్కసారి చూడచ్చు. మిగతా వాళ్ళు ఏదైనా TV లో ప్రేమియర్ వచ్చినప్పుడో చూడచ్చు.
నాకు సంబంధించినంత వరకు రేటింగ్: 3/ 5. ఇంకాస్త తగ్గించినా కూడా వాకే.