రంజాన్ ముస్లిం ల క్యాలెండరు లో
ఒక నెల. ఇంకా సరిగ్గా చెప్పాలంటే
అది వాళ్ళ తొమ్మిదో
నెల. ఈ రంజాన్ నెలలోనే భగవంతుడు
తన వాక్కు అయిన
కురాన్ పవిత్ర గ్రంధాన్ని మొహమ్మద్
ప్రవక్త (peace be upon him) గారికి అనుగ్రహించాడు
చెబుతారు. ఈ రంజాన్ నెలలో ఆఖరి
10 రోజులకి విశిష్ట ప్రాధాన్యత
ఉంది అని ముస్లిములు
విశ్వసిస్తారు. ఆ ఆఖరి పది రోజులలో
భగవంతుడు కురాన్ ముఖ్య భాగాలను
అనుగ్రహించాడు అని నమ్ముతారు. ఆ ఆఖరి పది రోజులలో బేసి సంఖ్య వచ్చే
ఎదో ఒకరోజున (one randome night) –
21st, 23rd, 25th
etc…. నాడు కురాన్
అనుగ్రహింప బడింది అని నమ్ముతారు. ఆ రాత్రి ని అరబిక్ లో Laylat
al-Qadr రాత్రి అని పిలుస్తారు. అందుకనే, చాలా మంది ముస్లిములు
ఆ ఆఖరి రోజులు మరింత నిష్టగా, పూర్తిగా భగవదారాధనలో
తమ కాలం వెచ్చిస్తారు. కొంతమంది ఆ
రోజులలో ఒక రాత్రి జాగారం
కూడా చేస్తారు.
Polar climates లో బ్రతికే వాళ్ళు రోజంతా సూర్యుడు కనిపిస్తూ ఉండడం వల్ల రంజాన్ నెలలో 20 –
22 గంటలు
ఉపవాసం చెయ్యాల్సి వస్తుంది.
వాళ్ళకి మక్కా సమయం తో
పాటు అనుసంధానం చేసుకుని ఉపవాసం చేసుకోవచ్చు అని ఒక
వెసులుబాటు ఇచ్చారు.
రంజాన్ లో ఉపవాసం అనురోదయం (Pre-dawn) నుంచి
సూర్యాస్తమయం దాకా చేస్తారు. ఉపవాసం మొదలు
పెట్టె ముందు తినే భోజనాన్ని ‘Suhur’ అని... ఉపవాసం ముగించేటప్పుడు తినే
భోజనాన్ని ‘Iftar’ అని పిలుస్తారు.
రంజాన్ లో దాన ధర్మాలకి చాలా ప్రాముఖ్యత
ఉంది. ముస్లిములు తమ సంపాదనలో ఒక నిర్ణీత భాగాన్ని
దాన ధర్మాలకి ఖచ్చితంగా ఇవ్వాలి అనే నియమం
ఉంది. దాన్ని ‘Zakaat’ అంటారు. అది కాకుండా శక్త్యాను సారంగా ఇచ్చే
దానాన్ని ‘Sadaqah’ అంటారు. ఈ
దానాలు ఎక్కువగా రంజాన్
నెలలో ఇస్తారు. అలా ఇవ్వడం వలన
పుణ్యం రెట్టింపు అవుతుందని నమ్మకం.
ముస్లిముల
calander చంద్రమాన ప్రకారం
కొలుస్తారు కనక, చంద్రుడిని చూసిన రోజునించి రంజాన్ దీక్షలు
ప్రారంభం అవుతాయి, అలాగే చంద్రుడిని నెలాఖరున మళ్ళి చూసినప్పుడు రంజాన్ నెల
ముగిసింది అని భావించి 1st day of
Shawwal - కొత్త నెల ప్రారంభమైన మొదటి రోజున Eid-Al-Fitr పండగ జరుపుకుంటారు.
No comments:
Post a Comment