India
builds world’s tallest statue: Modi launches Sardar Vallabhbhai Patel tribute
“The world will be forced to look at India when this statue stands
tall,” - Narendra Modi,
నిన్న సాయంత్రం ఇక్కడ ఒక మిత్రుడితో మామూలుగా
మాట్లాడుకునే మాటల్లో అనుకోకుండా ఒక చర్చకి దారి తీసింది. క్లుప్తంగా అదేమిటంటే
నరేంద్ర మోడీ ఈ మధ్య ప్రకటించిన సర్దార్ వల్లభాయి పటేల్ గారి విగ్రహ రూపకల్పన.
దానికి ఆయన దేశం లో ఉన్న అందరు రైతుల ఇనప పనిముట్ల నించి కొంత ఇనుముని విరాళంగా
కావాలని అభ్యర్ధించారు. నా మట్టుకు నాకు వ్యక్తిగతంగా ఆ ఆలోచన మహా బాగా
నచ్చేసింది. దేశాన్ని ఏకీకృతం చేసిన ఒక మహానుభావుడిని చిరకాలం గుర్తుంచుకునేలా
ఉండే ప్రయత్నం అది.
దానికి మా మిత్రుడు చాలా అభ్యంతరం తెలియ చేసాడు.
వెంటనే ఉపన్యాసం కూడా అందుకున్నాడు. “అబ్బే అది డబ్బుని వృధాగా ఖర్చు చెయ్యడమే,
దానివల్ల ఏమి ప్రయిజనం లేదు, దాని బదులు ఆ డబ్బుతో వేరే ఏమైనా స్కూళ్ళు
కట్టించచ్చు, బ్రిడ్జిలు కట్టచ్చు............” ఇలా చెప్పుకుంటూ పోయాడు.
నిజం చెప్పద్దూ.........ఇలాంటి కుహనా మేధావి
కబుర్లంటే నాకు మహా చెడ్డ చిరాకు. కొంతమందికి ఇంకొకడు చేసే ఏ పని నచ్చదు.
అన్నిటిలోనూ తప్పులు కనబడతాయి.
ఎవడు ఏది చెయ్యకుండా ఊరికే ఇలా ఊక దంపుడు కబుర్లు
చెప్పుకుంటూ కూర్చుంటే ప్రపంచం లో ఏది ఎక్కడా జరగదు. ప్రతీ కట్టడం వెనక ఒక
చారిత్రిక నిజం ఉంటుంది. అందరు ఇలాంటి కబుర్లు వాళ్ళ వీధి వరండా లో పడక కుర్చీలో
కాళ్ళు చాపుకుని కూర్చుని న్యూస్ పేపర్ చదువుకుంటూ అనుకుని ఉంటె, ప్రపంచం లో
ఇప్పుడు మనం చూసే చరిత్ర ప్రసిద్ది కట్టడాలు ఉండేవా? ఒక చార్మినార్, ఒక తాజ్మహల్,
ఒక Eiffel Tower, ఒక Liberty Statue... ఇలా అన్ని వచ్చేవా? అలానే భారత దేశ చిరస్మరణీయ
సర్దార్ పటేల్ విగ్రహం కూడాను.
మనకి కోట్లు ఖర్చుపెట్టి రోడ్లు వేస్తే టోల్ కట్టడం
నచ్చదు. మంచి AC బస్సులు వేసి ఒక రూపాయి ఎక్కువ కట్టండి అంటే నచ్చదు. మనం మాత్రం
ఉచితంగా సలహాలు ధారాళంగా ఇచ్చిపడేస్తాం, “అబ్బే ఈ ఖర్చు వేష్టు, దీని బదులు ఒక పూట
భోజనం పెట్టచ్చు, ఒక ఇల్లు కట్టచ్చు” అని. ఇవేమీ
వద్దు అని నేను అనట్లేదు, వీటితో పాటు ఇలాంటి అంతర్జాతీయ ప్రాచుర్యం పొందే
కట్టడాలు కూడా కావాలి మనకి. ఇప్పటికి బయట దేశాల్లో మన భారత దేశం అంటే చిన్న చూపే
ఇప్పటికి మనం ఒక బీద దేశమే అన్న భావన. గుండెల మీద చెయ్యి వేసుకుని చెప్పండి మనం
ఇంకా బీద దేశమేనా?
నేను రాజకీయ వాదిని కాను. నాకు ఈ పనిలో రాజకీయం కన్నా
ఒక జాతీయ అవసరం కనబడుతోంది. మోడీ మనస్సులో రాజకీయాలు ఉంటె ఉండచ్చు గాక నాకు మాత్రం
ఈ ఆలోచన బాగా నచ్చింది.
for me too..
ReplyDeleteధన్య వాదాలు అండి
DeleteRightly said!
ReplyDeleteధన్యవాదాలు అండి
DeleteI concur with u
ReplyDeleteధన్య వాదాలు అండి
Deleteమీరు చెప్పింది నిజం. ప్రతీదానికీ ఎందుకు.. దానికన్నా ఇది ఇలా చేయవచ్చు కదా.. ఇలాంటి పిచ్చి సలహాలు చాలా నష్టాన్ని తీసుకువస్తాయి. ఏదో సామెత చెప్పినట్లు తెలివైన శతృవు కన్న తెలివి తక్కువ మితృడు ప్రమాదకారి..
ReplyDeleteమెహెర్ శివ