Tuesday, March 12, 2013

మిధునం - తెలుగు సినిమా



శ్రీరమణ రచించిన మిధునం కధ ని సినిమా గా తీసిన తనికెళ్ళ దశ భరణి గారి చిత్ర రాజములోని కొన్ని అధ్బుతమైన డైలాగులు, నలుగురికి చెప్పి వాళ్ళని ఆ అద్భుత కళా ఖండాన్ని చూసేలా చెయ్యాలన్న తాపత్రయమే తప్ప, ఏవో copy rights అవీ ఉల్లంఘించాలని కాదుసుమా!!!




Ø దాంపత్యమూ - ధప్పళము (గుమ్మడికాయ ముక్కల పులుసు )....మరిగిన కొద్దీ రుచి"

Ø దొంగ బెల్లం ...దొంగ ముద్దు, అనుభవిస్తే కాని తెలియదు"

Ø అంతే కాని ఇప్పుడు? ప్రతీ వాడికి శంఖు చక్రాల్లా బీపీ, షుగరూ....!!!
ఎందుకు రావు? 
నీళ్ళకి స్విచ్చి, నిప్పులకి స్విచ్చి, పచ్చడికి స్విచ్చి, పిండికి స్విచ్చి....ఆఖరికి ఆ స్విచ్చివేసుకోడానికి ఓపిక లేకుండా దానికి కూడా ఓ రిమోటు స్విచ్చి!!!!"

Ø మనిషిగా పుట్టడం సులువేనయ్యా...కాని మనిషిలా బ్రతకడమే కష్టం"

Ø ఒక్కడ్నో ఇద్దర్నో కంటా వనుకుని పెద్దవాడికి కృష్ణా అని పేరు పెట్టాను...ఏడాది తిరగకుండా పుట్టుకోస్తుంటే.. ప్రతీ సంవత్సరం పేర్ల కోసం ఎక్కడ అఘోరించడం అనీ.............ఇంకా నావల్లకాక...కేశవ నామాలు అందుకున్నా...!!"

Ø ఊరగా............ఊరగా....ఊరగాయ.
కోరగా ....కోరగా.........కొబ్బరి"

Ø కలలు కన్న దేశానికి వెళ్ళాకా ...కన్న దేశం కలలోకి వస్తుంటుంది"

Ø " అదే మనం Air-India flight ఎక్కామనుకోండి? మన air-hostess కాఫీ తెచ్చేలోపు అమెరికా వచ్చేస్తుంది



14 comments:

  1. Namaste!

    Chala baunandii mee view!

    gulabi rangu ki marigina pala meeda meegada lanti dailouges chakkagaa raseru.

    andangaa chusinandukuu, malli vaatini gurtu techinanduku dhanyavaadaalu.

    Mee itara postulu kuda chala baunanyi. chalaasarlu anukuni rayaledu ..

    sridevi

    ReplyDelete
    Replies
    1. నమస్తే శ్రీ దేవిగారు.

      అవును మీరన్నట్టు ఇంకా చాలా మంచి మంచి డైలాగులు ఉన్నాయి. ఈ రోజుల్లో వాటిని విని అర్ధం చేసుకునే ఓపికా, తీరికా ఉన్నవాళ్ళు కొద్ది మండే ఉంది ఉంటారని అనుకుంటున్నా..పోనిలే ఇలా అరటి పండు వోలిచినట్టు ఇస్తే, కాస్త తినిపెడతారేమో అని ఒక చిన్ని ప్రయత్నం.

      బ్లాగు నచ్చింది అన్నందుకు ధన్యవాదాలు, ఏవో కాలక్షేపం కబుర్లు అంతే.

      Delete
  2. అట్టాచ్మెంట్ డిట్టాచ్మెంట్ ...మీద డైలోగ్ కూడా బాగుంటుంది.

    ReplyDelete
    Replies
    1. అవునండి 'వెన్నెల' గారు,

      నా మిత్రుడు శ్రీరాం కూడా అదే అన్నాడు - attached detachment. "వాళ్ళు మనకోసం వెంపర్లాడాలి కాని మనం వాళ్ళ కోసం వేళ్ళాడ్డం ఏమిటి నాన్సెన్స్" అది కూడా బావుంది.

      Delete
  3. వెంకట్ గారు,
    బ్లాగుల్లో ఈ సినిమా గురించి చెబితే చూడాలని కూచున్నా,అబ్బయి మెయిల్లో బాబాయ్ సినిమా చూడు అన్నీ నీ మాటలే అన్నాడు, మా కోడలు చూడండి మామయ్య గారు అన్నీ మీడయలాగుల్లాగే ఉన్నాయని కూడా అంది, ఒక సుభ ముహూర్తం లో చూడాలని తీర్మానించుకు కూచున్నాం ఇల్లాలూ నేనూ, మా కర్ంటు వాడికి కళ్ళు కుట్టేయి, పీకేసేడు.ఇప్పటికీ చూడలేదు :(

    ReplyDelete
    Replies
    1. కష్టే ఫలి గారు, నేను కూడా ఇంచుమించుగా అలాంటి ప్రయత్నాలే చాలా చేసి, చివరికి మొన్న తెగించి India నించి ఒక DVD కొని తెచ్చుకుని ఇప్పటికి చూడగలిగా. అలాగే మీరు కూడా చూసేస్తారు లెండి.

      మళ్ళి ఎండలు బాగా ముదరక ముందే చూసెయ్యండి, అప్పుడు ఈ కాస్త కరెంటు కూడా ఉండదు అని అభిజ్ఞ వర్గాల భోగట్టా.

      Delete
    2. youtube లో సినిమా ఫ్రీ గా పెట్టారండి.

      Delete
    3. అవును పెట్టారని అనుకున్నా కాని మొన్న హైదరాబాద్ వెళ్ళినప్పుడు youtube పెడితే........."sorry this movie is not made available in your country (India)" అని వచ్చింది. అప్పుడు ఉన్నపళంగా కోఠి వెళ్లి ఒరిజినల్ DVD కొని తెచ్చుకున్నా...పాపం ఇంతా చేసి DVD ఖరీదు Rs.145/- మాత్రమె అండి.

      Delete
  4. శుభ ముహూర్తం

    ReplyDelete
  5. పుస్తకం,సినిమా
    రెండూ దేనికదే..
    అలాంటి జీవనసంధ్య నిజంగా ఒక వరం..:)
    మీరు ప్రస్తావించిన అన్ని సంభషణలతో పాటూ,
    చివరిలో
    "బంగారం కరిగిపోయింది..లక్క మిగిలిపోయింది.."
    నన్ను బాగా కదిలించింది.
    అన్నట్లు మీ బ్లాగు పేరు కబుర్లపోగు బాగుందండి తమాషాగా ..బామ్మ మాటన్నమాట..:))

    ReplyDelete
    Replies
    1. అవునండి ధాత్రి గారు,

      మీరన్నది నిజం. పుస్తకం - సినిమా రెండు వేటికవే. తనికెళ్ళ భరణి గారి దర్శకత్వం అమోఘం గా ఉంది నాకు.

      బంగారం - లక్క డైలాగు వచ్చినప్పుడు కళ్ళల్లో నీళ్ళు తిరుగుతాయి.

      మీరన్నట్టు అలాంటి జీవన సంధ్య రావాలంటే (కావాలంటే) జీవితాన్ని దగ్గరగా నిజాయితీ గా చూసి అనుభవించి ఉండాలి. ఈ రోజుల్లో అలా ఎవరు ఉంటున్నారు చెప్పండి? "మా ఇంటికి వస్తే మీరేమి తెస్తారు? మీ ఇంటికొస్తే మాకేమిటిస్తారు?" ఇదే తంతు.....అంతా డబ్బు మయం.

      Delete
  6. నువ్వు ఇంకా రివ్యూ రాయలేదేమిటి అనుకున్నా. నాకు చాల నచ్చింది. విచిత్రం, ఈ రోజుల్లో కూడా ఇలాంటి సినిమాలు , younger జనరేషన్ like చెస్తుంటే, చాల హ్యాపీ గ వుంది . రివ్యూ బాగుంది.
    పెదమావ్.

    ReplyDelete
    Replies
    1. చాలా థాంక్స్ పెద్దమావ్,

      ఇప్పటిదాకా ఈ సినిమా చూసే అవకాశం దొరకలేదు (ఇక్కడ రిలీస్ కాలేదు), మొన్న ఒక వారానికి హైదరాబాద్ వెళ్ళినప్పుడు DVD కొనుక్కు తెచ్చుకుని శ్రద్దగా చూసాను. చాలా చాలా నచ్చింది. కొన్ని కొన్ని చోట్ల కళ్ళు చెమర్చాయి.

      ఇది రివ్యూ రూపంలో రాయలేదు..ఊరికే నాకు బాగా నచ్చేసిన డైలాగులు మళ్ళి ఒకచోట పెట్టాను అంతే!!

      నీకు నచ్చిందని అన్నందుకు చాలా ఆనందం గా ఉంది.

      Delete