జబర్దస్త్ - సిద్దార్థ్ & సమంత (నిత్యా మీనన్ ప్రత్యెక పాత్రలో), నందిని రెడ్డి(అలామోదలయ్యింది ఫేమ్)- దర్శకత్వం
హిందీ లో వచ్చిన Band Bajaa Baraat చిత్రానికి నకలు ప్రయత్నం. మొదటి భాగం వరకు పూర్తిగా ఆ హిందీ చిత్రంకి అనువాదం కాబట్టి చాలా బాగా తీసింది దర్శకురాలు. చిత్రం కూడా బాగానే సాగిపోతుంది కాస్త నవ్వుకోవచ్చు. సమంత సిద్దార్ద్ బావున్నారు.
రెండో భాగం వచ్చేసరికి దర్శకురాలు తన స్వంత బుర్ర ఉపయోగించి తనదైన సినిమాని చిత్రకల్పన చేసారు. పూర్తిగా కుక్కలు చింపిన విస్తరిలా తయారయ్యింది సినిమా. ఎక్కడికి వెళ్తున్నామో? ఎంచూస్తున్నామో అర్ధం కాని పరిస్థితి. రెండో భాగం లో సినిమా చాలా వెర్రి మొర్రి మలుపులు తిరుగుతుంది..చాలా చోట్ల చిరాకువేస్తుంది కూడా.
తాగుబోతు రమేష్ ని ఒక హాస్య నటుడు అని అనుకోమంటే నేను ఒప్పుకోను. ఇతన్ని ఇలాగే చూస్తూ చూస్త్హూ ఉంటె ...... చాలా చిరాకు వేస్తోంది. అతను ఎంత త్వరగా అలాంటి పాత్రలు మానేస్తే అతనికి అంత మంచిది అని నా అభిప్రాయం.
సాయాజీ షిండే, శ్రీహరి పాత్రలు అసలు ఎందుకో నాకు అర్ధం కాలేదు. నిత్యా మీనన్ పాత్ర చిన్నదే కాస్సేపు బావుంది, అదృష్టం కలిసివచ్చి సీక్వెల్ గా రెండో సినిమా తీస్తే ఎందుకైనా ఉంటుందని శుభం కార్డులో నిత్యా మీనన్ మొహం అలా చూపిస్తారు అని అనుకుంటా!!!
మరీ ఖర్మ కాలిపోతే తప్ప ఈ సినిమాని వెళ్లి చూడక్కర్లేదు. లేదా వెళ్లి మొదటి భాగాన్ని చూసేసి రండి.
2.5/ 5
No comments:
Post a Comment