Wednesday, January 23, 2013

Dubai స్వర్గం అనబడే గల్ఫ్ కష్టాలు కధ.


(ఇది నా ఆత్మ కధ కాదు, దూరపుకొండలు - part 2 లో ఆ వివరాలు ఇస్తాను) 

గల్ఫ్ లో భారతీయుల కష్టాలు అన్న వార్తలు రోజూ చూస్తున్నాం. నిజా నిజాలు ఏమిటి కాస్త వివరాల్లోకి వెళితే..........
ముందు మనం గల్ఫ్ లో ప్రభుత్వ విధానాలు ఏమిటి అన్న విషయం తెలుసుకోవాలి.
ఇక్కడ దేశం లోకి ప్రవేశించడానికి స్థూలంగా మూడు  మార్గాలు ఉన్నాయి. Visit Visa – పేరుకు తగ్గట్టే ఇది ఊరికే అలా వెళ్లి రావడానికి మాత్రమే, ఇది సాధారణం గా మనకి తెలిసిన వారు - అంటే చుట్టాలు, స్నేహితులు sponsor చేసి అక్కడికి పిలిపించుకునేది. దీని కాల పరిమితి సాధారణం గా 10 రోజుల నించి మూడు నెలల దాకా ఉండచ్చు, కాల పరిమితిని బట్టి వీసా రుసుము ఉంటుంది. రెండవది Tourist Visa...దీనిగురించి పెద్ద వివరాలు అక్కర్లేదు అనుకుంటాను (పేరులోనే అన్ని ఉన్నాయి). ఇంకా మూడోది మన  ప్రస్తుత విషయానికి సంబంధించినది... Employment Visa.
ఎంప్లాయిమెంట్ వీసాకి సంబంధించి కొన్ని రూల్సు ఉన్నాయి ఇక్కడ. మనకి ఇక్కడ ఏదైనా కంపెనీలో ఉద్యోగం దొరికితేనే ఆ కంపెని వాళ్ళు మనకి employment visa ఇస్తారు. వాళ్ళు మనకి Sponsor అన్నమాట. ఊరికే ఇక్కడికి ఎదో వీసాలో వచ్చేసి ఉద్యోగం వెతుక్కుంటాం అంటే కుదరదు అన్నమాట. (అంటే వెతుక్కోవచ్చు, దొరికింది అనుకున్నాక, మళ్ళి మనం వెనక్కి వెళ్లి వాళ్ళ కొత్త వీసా మీద ఇక్కడకి రావాలి – ఒక రకంగా) ఒక company visa లో ఉద్యోగం లో చేరాకా, మళ్ళి అక్కడా ఇక్కడా తీరిక సమయాల్లో వేరే పని చేసుకుందాం ఎదో రకంగా కష్టపడి అంటే ఇక్కడి రూల్సు ఒప్పుకోవు. అది చట్ట విరుద్దం పట్టుకుంటే భారి జరిమానా, ఒక్కోసారి జైలు కూడా. అలాగే ఒకసారి ఉద్యోగం లో చేరాకా ఇక్కడి sponsor అది ఒక company అయినా సరే మన passport వాళ్ళ దగ్గిర పెట్టేసుకుంటారు. (మనం పారిపోకుండా అన్నమాట), దీనికి ఒక కారణం ఏమిటి అంటే, sponsor కింద ఉన్న ఉద్యోగి అక్కడే దేశంలో వేరే చోటకి పారిపొయినా, కనబడకుండా పోయినా అది sponsor నెత్తి  మీదకి వస్తుంది. ఒక్కోసారి అలాంటి సందర్భం ఎదురైతే sponsor తన కింద ఉన్న ఉద్యోగి కనబడడం లేదు అని పొలిసు లో కంప్లైంట్ ఇచ్చి చేతులు దులిపేసుకుంటారు. ఇంక ఆ క్షణం నించి ఆ ఉద్యోగి ఒక అక్రమ వలస దారుడిగా పరిగణించ బడతారు. ఎవరి నైనా ఉద్యోగం లోంచి తీసేస్తే ఆ ఉద్యోగికి టిక్కెట్టు కొని airport లో విమానం ఎక్కించి వారి visa papers మీద exit స్టాంప్ కొట్టించుకునే దాకా ఆ company కి ఇమ్మిగ్రేషన్ డిపార్టుమెంటు లో క్లియరెన్స్ దొరకదు. వాళ్ళు తన company ని కూడా సరిగ్గా నడుపుకోలేరు. భారి జరిమానాలు ఉంటాయి company కి.
కొన్నికొన్ని సందర్భాల్లో company అన్యాయంగా ఉద్యోగం తీసేసి, ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వక ఆ ఉద్యోగి పారిపోయాడు అని కేసు లు పెడుతుంది, అలాంటప్పుడు employee labour court కి వెళ్ళవచ్చు, సాధారణం గా 90% కేసుల్లో  న్యాయం జరుగుతుంది అక్కడ.

Just for information, UAE Govt website link ఇక్కడ ఇస్తున్నా Visa నియమాల గురించి (ఈ లింక్ ని browser లో copy paste చేసి, కావాల్సిన సమాచారాన్ని క్లిక్ చేసి చదువుకోండి)

http://dnrd.ae/en/Rules_Reg/Pages/Rules.aspx?AudianceId=3

మనం ఇప్పుడు papers లో చూసే గల్ఫ్ భారతీయుల కధలు ఏమిటి అంటే, ఇక్కడికి వాళ్ళు తెలియక Visit visa/ tourist visa మీద వచ్చేసి ఉంటారు, ఉద్యోగం దొరికి ఉండదు, ఇంకా ఇక్కడే ఎదో ఆ పని ఈ పని చేస్కుని అక్కడా ఇక్కడా దొంగతనం గా ఉంటూ ఉండి ఉంటారు. ఇంకొన్ని ఎక్కువ కేసుల్లో ఇక్కడి లోకల్ company లు/ వ్యక్తులు  వీసాలు అమ్ముకుంటారు, అంటే మా company లో/ లేదా మా ఇంట్లో  పనిచేస్తున్నాడు అని visa ఇచ్చి వాడి దగ్గిర నించి డబ్బు తీసుకుంటారు. ఇలాంటి వాళ్ళు సాధారణం గా వంటవాళ్ళుగా, డ్రైవర్ లు గా, house maids గా, cleaner లు గా, వడ్రంగి, తాపీ మేస్త్రి, ఎలక్ట్రీషియన్, చాకలి పని.......ఇలా వస్తుంటారు. వచ్చి ఇక్కడ వల్ల ఇంట్లో వీళ్ళ ఇంట్లో అలా చాలా ఇళ్ళల్లో/ ఆఫీస్ లలో  freelancer లు గా బాగానే సంపాదిస్తారు కొన్నేళ్ళు (ఎవరైనా పట్టుబడితే, పని చేసిన వాడికి, చేయించుకున్న వాడికి జరిమానా చాలా లక్షల రూపాయల్లో ఉంటుంది, ఒక్కోసారి జైలు కూడా ఉండచ్చు) . ఇలా జరిగినంత కాలం బాగానే నడుస్తుంది, ఎప్పుడో ఒకసారి వీడికి వాడికి ఏవో లెక్కల్లో తేడా  వచ్చి, sponsor my employee is missing’ అని కేసు పెడతాడు. అప్పటి నించి మన వాళ్ళ  కష్టాలు మొదలవుతాయి. ఒక సారి వీసా గడువు పూర్తయ్యాక, అతను వెనక్కి వెళ్ళాలంటే airport లో అధికారులు పట్టుకుంటారు, అందుకని ఆ భయం తో ఇక్కడే ఉండిపోతారు బిక్కు బిక్కుమంటూ. పరిస్థితుల ప్రభావం వల్ల, చిల్లర దొంగతనాలు, దెబ్బలాటలు, హత్యలు, ఉరిశిక్షలు ఇలా...ఊబిలోకి కూరుకు పోతారు. మనవాళ్ళ పరిస్థితికి ఇక్కడి ప్రభుత్వాల్ని నిందించి ప్రయోజనం లేదు, ఉన్నతలో ఇక్కడి ప్రభుత్వాలు పాపం బాగానే చూస్తున్నాయని చెప్పాలి. తప్పులో సింహభాగం మన ప్రభుత్వాలది, మన అమాయక జనాలది.

Gulf News Photo
ఇక్కడ గల్ఫ్ లో ముఖ్యంగా ఖర్చుల గురించి చెప్పుకోవాలి... పేరుకి tax లేదు అన్న మాట అంతే. అన్ని ఖర్చులు గూబ గుయ్యి మనిపించేలా ఉంటాయి. పైన చెప్పిన చిన్న చిన్న ఉద్యోగాలకి ఇచ్చే జీతం నెలకి 800 – 1200 Dirhams. దీనికి మనవాళ్ళు మన రూపాయల్లో చూసుకుని.......”మా వాడు అక్కడ నెలకి పదిహేను వేలు సంపాదిస్తున్నాడు అని చెప్పేసుకుంటారు. పాపం ఒక చిన్న పని వాడికి, వినడానికి అది ఒక పెద్ద మొత్తమే కావచ్చు, కానీ నిజంగా చూస్తే ఇక్కడ అది ఎందుకు సరిపోదు. ఒక రూములో 4 గురు (కాస్త మంచి ఉద్యోగం అయితే) లేదా 6 గురు, 8 మంది  (మరీ చిన్న ఉద్యోగం అయితే) కలిసి ఉండాలి. దీన్నే ఇక్కడి వాడుక భాషలో Bed space అంటారు. ఒక bedspace ఖరీదు కనీసం 500 dirhams (మన భాషలో Rs.7500).  ఇప్పుడు చెప్పండి మనకి వచ్చే  1200 లలో bedspace కి అది పోగా ఇంకా మిగిలేది ఎంత? తిండి, బట్టలు, తిరుగుడు, మందులు, రోగాలు  మిగతావి?? “మా వాడు దుబాయ్ లో ఉద్యోగం..........లక్షల్లో సంపాదించేస్తునాడు “ అనుకునే వాళ్లకి నెల నేలా ఎంతో కొంత పంపాలి కదా మరి? అదెలా? ఏడాదికో, రెండేళ్ళకో ఇంటికి వెళ్ళాలి అంటే flight ticket? (కొన్ని కంపెనీలు టిక్కెట్టు ఇస్తాయి కొన్ని ఇవ్వవు, ఉద్యోగ షరతుల బట్టి).

ఉదాహరణకి నేను చేసే ఉద్యోగం చాలా మంచిది, ఇక్కడ – అక్కడ మనవాళ్ళ భాషలో చెప్పుకునేలా చాలా పెద్ద ఉద్యోగం. నేను ఉండే ఇల్లు ఒక పెద్ద ఇంట్లో చాలా చిన్న వాటా మాత్రమే. ఒక బెడ్రూము, బుల్లి హాలు, అందులోనే వంట స్నానం అన్ని.....దీనికి నేను కట్టే అద్దె నెలకి అక్షరాలా...4000 dirhams మన లెక్కల్లో 60,000/- (నీళ్ళు కరెంటు, ఇంటర్నెట్  కాకుండా)దీన్ని బట్టి అర్ధం చేసుకోవచ్చు మనకి వచ్చే లక్షలు ఏ మూలకి సరిపోతాయో... ఇప్పుడు కొత్త రూల్స్ ప్రకారం ఇక్కడ కూడా ఈ ఇంట్లో నేను ఉండకూదదుట...ఇలా ఇళ్ళల్లో వాటాలు తీసుకుని ఉండడం చట్ట విరుద్దం ట ఇప్పుడు. ప్రతీ వాడు తప్పని సరిగా ఒక separate flat లో ఉండాలి ట. దానికి నెల అద్దె కనీసం 5000 – 6000 dirhams (అంటే 75000 – 90000 నెలకి) ఇది కూడా single bedroom flat ఊరికి ఒక 50 కిలోమీటర్ల దూరం లో దొరుకుతాయి. నాకు వచ్చే ఏప్రిల్ నెల గడువు. ఇల్లు మరి తీరాలి. అంత దూరం వెళితే పనికి రాను పోను transport ...అదొక ఖర్చు.

ఇన్ని విషయాలు చెప్పినా ఎవరైనా వింటారా అంటే.........”ఊహు..నువ్వేమో లక్షలు సంపాదించేస్తున్నావు, కోట్లు కూడా బెట్టేసావ్, నేను వస్తా అంటే మాత్రం ఏడుస్తున్నావు” అని అనుకుంటారు.

ఒక రకంగా ఇక్కడి పరిస్థితి “గోదావరి ఈత లంక మేత” అన్న సామెతలా ఉంటుంది. గోదావరి నది మధ్యలో చిన్న చిన్న లంకలు (ఇసుక తిన్నెలు) ఉంటాయి. వాటి మీద పచ్చటి గడ్డి చాలా మొలిచి ఉంటుంది. తీరం ఇవతలి పక్కనించి చాలా మనోహరంగా కనబడుతుంది ఆ దృశ్యం. ఇవతలి వేపు ఉన్న గేదెలు వాటిని చూసి, ఝామ్మంటూ గోదాట్లోకి దూకేసి ఆవేశంగా అంత దూరం గోదావరి మధ్య దాకా ఈదేసుకుంటూ వెళ్ళిపోయి....హాయిగా కడుపారా, మనస్సుకి తృప్తి కలిగే దాకా ఆ పచ్చటి గడ్డిని తింటాయిట. అంత అయ్యాకా...మళ్ళి అంత గోదావరి ని ఈదుకుని వెనక్కి గట్టుకి వచ్చేసరికి, అంత సేపు తిన్న గడ్డి, ఆ శ్రమకి హరాయించేసుకు పోయి...మళ్ళి ఆ గేదేలకి  వెంటనే ఆకలి దంచేస్తుందిట. మళ్ళి కధ మొదటికి. అలా ఇక్కడ లక్షలు సంపాదించేసి..........మళ్ళి లక్షల్లో ఖర్చుపెట్టేసి చివరకి మిగిలేది అప్పుల్లో.

పోనీ ఇవన్ని వదిలేసి వెనక్కి వెళ్ళిపోతేనో అని అనుకుంటే? వెనక్కి వెళ్లి ఏమి చెయ్యాలి? మనకి ఇప్పుడు ఎవరు ఉద్యోగం ఇస్తారు? వయస్సు మీరిపోయింది కదా? ఇలాంటి సవా లక్ష ప్రశ్నలు. చివరకి కష్ట నష్టాలు బేరీజు వేసుకుంటే, ఇక్కడే ఉంది ఎదో రకంగా కాలం వెళ్ళ దీయడం బెటర్, అన్న జ్ఞానోదయం అవుతుంది.  
ఇన్ని విన్నా కూడా మనం అసలు విషయం గ్రహిస్తామా? అబ్బే “మనవాళ్ళు ఒట్టి వెధవాయిలోయ్” అని ఒక డైలాగు పారేసి మళ్ళి మన పనిలో మన ప్రయత్నాల్లో మనం నిమగ్నమైపోతాము.
WELCOME TO DUBAI.

17 comments:

  1. దుబాయ్ కష్టాల గురించి కళ్ళకి కట్టినట్టు రాసారు.

    ReplyDelete
    Replies
    1. పొద్దున్న లేస్తే చూసేవి ఇవే కదండీ......బాధేస్తుంది

      Delete
  2. ఒక దురదృషవంతుడు డ్రయివర్ గా పని చేసి చాలా అవస్థలు పది ఇక్కడికి చేరేడు, ఆ కేస్ నా దగ్గరకి తీసుకొచ్చాడు, కంప్లయింటు రాసిపెట్టామని, జీతమివ్వలేదు, వేధించారని, రాసిచ్చాను, అప్పుడే చెప్పేను, ఏమీ జరగదు, నువ్వు క్షేమంగా బయట పడగలిగేవు, అందుకు సంతోషించని.

    ReplyDelete
    Replies
    1. @కష్టేఫలె గారు, ఆ అబ్బాయి ఆ కంప్లైంట్ ఇక్కడే ఉన్నప్పుడు ఇక్కడ లేబర్ కోర్ట్ లో ఇచ్చి ఉంటె, పరిస్థితి వేరేలా ఉండేది. ఒకసారి ఇండియా వెళ్లిపోయాకా ఏది కాదు. ఎందుకంటే VISA కాన్సుల్ చెయ్యాలంటే, employee - end of service settlement paper sign చేసి ఇవ్వాలి, అది లేకుండా యజమాని visa cancel చెయ్యలేడు. కాని మన వాళ్ళు పాపం తెలియక ఎదో గొర్రెల్లా అన్ని కాయితాలు సంతకం పెట్టి వచ్చేస్తారు. యజమాని Visa cancel అయినా చెయ్యాలి, లేదా వీడు మా దగ్గిర పనిచెయ్యకుండా పారిపోయాడు అని complaint ఇవ్వాలి.

      Delete
  3. వీడు విసిట్ వీసా మీద వెళ్ళి ఉద్యోగం సంపాదించాడు. లొసుగు ఉంది వీడి దగ్గరే.విసిట్ వీసాని మళ్ళీ ఇక్కడికి వచ్చి రెగులర్ స్పాన్సర్ వీసా తీసుకోలేదు.

    ReplyDelete
  4. ammo ... migathaavi ela vunnaa ... chaala costly andi baabu ... illu, traveling maatram ...

    ReplyDelete
  5. Problems chala clear ga explain chesarandi.. Very useful information for the new aspirants...

    ReplyDelete
    Replies
    1. చంద్రశేఖర్ గారు, ఎదో భయపెడదామనో? అతిశయోక్తి తోనో చెప్పడం లేదు, ఇక్కడ ఇప్పుడు పైన చెప్పిన దాని కంటే ఎక్కువ కష్టాలు ఉన్నాయి.........మళ్ళి ఇంకో సారి ఎప్పుడైనా.....

      Delete
  6. అరటి పండు ఒలిచి నోట్లో పెటినట్టు చెప్పారు . దీన్ని బట్టి చుస్తే మన దేశంలోనె ఎదో ఒక పని చూసుకుంటే బెటర్ ..

    ReplyDelete
  7. అరటి పండు ఒలిచి నోట్లో పెటినట్టు చెప్పారు . దీన్ని బట్టి చుస్తే మన దేశంలోనె ఎదో ఒక పని చూసుకుంటే బెటర్ ..

    ReplyDelete
  8. గల్ప్ దేశాల వలస 1973లో ప్రారంభమైంది..
    ఎదురు డబ్బులు ఇచ్చి తీసుకెళ్లే అరబ్బియులు.. 1975 నుంచి ఎజెంట్ల దోపీడి ప్రారంభమైంది..
    ఆ తరువాతనే వీసా ల పేరిటా దోపీడి చేయడం.. పనికి తగ్గ ఫలితం రాక పోవడం పరిపాటి అయ్యింది.. కానీ.. ఇప్పుడైతే.. గల్ప్ దేశాలలో పరిస్థితి మరీ దారుణంగా మారింది...
    సౌది అరెబియాలో అమలులోకి వచ్చిన నికరత్ చట్టం వల్ల మన వాళ్లు చాలా మంది జైల్ లో మగ్గుతున్నారు.. ఇవన్నిీ తెలిసి బాధ పడుతాను..
    - యాటకర్ల మల్లేష్ రిపోర్టర్.. వీ6 న్యూస్ హైదరాబాద్...

    ReplyDelete
  9. గల్ఫ్ బాధలపై బుక్ రాయాలని ఉంది.. కానీ.. వివరాలు నాకు అంతగా తెలియవు.. మీకు సమాచారం తెలిస్తే.. yatakarlamallesh@yahoo.com కు వివరాలు పంపండి..

    ReplyDelete
  10. గల్ప్ దేశాలలో మనవారు ఎదుర్కోనే బాధలను కళ్లకు కట్టినట్లు వివరించారు.. ధన్యవాదాలు..
    జర్నలిస్ట్ గా దుబాయ్.. అబుదాబి వెళ్లి పుస్తకం రాశాను..
    -యాటకర్ల మల్లేష్, జర్నలిస్ట్.. 949 222 5111

    ReplyDelete