నిన్న కాక మొన్న అంటే జనవరి 8 న దుబాయ్ నించి అబూ ధాబి మాకు తెలుసున్న ఒక
మలయాళీ అబ్బాయి టాక్సీ లో వస్తున్నా.. వస్తు దారిలో ఉండగా నేను అబూ ధాబి లో ఒక
అతనికి ఫోన్ చేసి “ఒరేయ్ బాబు ఇవ్వాళ సాయంత్రం 7.30 షో కి ‘నాయక్’ ఒక టిక్కెట్టు కొను” అని ఫోన్ లో చెపుతుండగా... మా డ్రైవర్
అష్రఫ్ నాకేసి ఎగాదిగా చూసాడు. ఫోన్
మాట్లాడడం అయ్యాకా “సార్ ఆ సినిమా ఎవరిదీ? అల్లు అర్జున్ దా”? అన్నాడు. అంటే వాళ్ళ
కేరళా లో అల్లు బాగా ఫేమస్ ట. “లేదు నాయనా ఇతను వాళ్ళ చుట్టాలబ్బాయి, ఇతను కూడా
పెద్ద హీరో మా state లో” అని చెప్పాను. “ఇప్పుడే కాల్ చేసి చేపుతున్నారంటే చాలా
బాగా ఉంటుందేమో సినిమా” అన్నాడు మా వాడు. “లేదు బాబు ఇదేమి పెద్ద కళాత్మక సినిమా
కాదు, ఏవో నాలుగు fights, ఒక అయిదు పాటలు, యాభైమంది గ్రూపు డాన్సర్ లు, కొన్ని మూస
డైలాగు లు ఉంటాయి” అని చెప్పాను. “కాని కాస్త టైం పాస్ కి వెళ్తాను తప్పదు“ అని అన్నా.
మీకు అనుమానం వస్తోంది కదా? మలయాళీ వాడు అన్నాడు, మరి
తెలుగులో దంచేస్తున్నాడు వాడితో అని? “[ఇక్కడ సంభాషణలు వాడితో హిందీ లో జరిగినా
జనసామాన్యానికి అనుకూలంగా ఉంటుందని అన్ని సంభాషణలు తెలుగులోనే తెలియపరచదమైనది ]”
సరిగ్గా మన నాయక్ సినిమా మొదలయ్యేముందు ఇలాగే
చూపిస్తాడు. “సినిమా లో సన్నివేశాలు కలకత్తా లో జరిగినా ప్రేక్షకుల వీలుగురించి
అన్ని సంభాషణలు తెలుగులో జరపడమైనది” (కాస్త అటూ ఇటూగా ఇలాగే రాసారు).
ఇంక సినిమా గురించి:
టాక్సీ వాడితో తప్పు చెప్పాను. ఏవో నాలుగు fights
అన్నాను, కాని ఇందులో ఒక నలభై fights ఉన్నాయి. ఆరు పాటలు ఉన్నాయి కాని ఎందుకో
సినిమాలో చూస్తున్నప్పుడు మాత్రం అవసరం ఉన్నా లేకపోయినా నిమిషానికో పాటలా
అనిపించింది.
రాం చరణ్ మొహం లో పెద్దగా హావ భావాలు పలికిన్చలేకపోయినా
హట్టా కట్టా గా fights బాగా చేసాడు. కొన్ని చోట్ల fights కాస్త మరీ అసహజంగా
అనిపించినా సినిమాటిక్ గా బాగానే ఉన్నాయి. (కొంతమందికి fights కొండొకచో బోర్
కొట్టినా కొట్టొచ్చు)
హీరోయిన్ కాజల్ - షరా మామూలే వచ్చి మీద పడి అబ్బాయిని
ప్రేమించడం వెనకాల పడి తిరగడం. అంతకు మించి పెద్దగా ఏమిలేదు విషయం. ఇద్దరి మీద
చిత్రీకరించిన పాట... “ఒక చూపుకే పడిపోయా” పాటలో స్టెప్పులు భలే బాగా నచ్చేసాయి
నాకు. బాగా ఉంది ఆ పాట చిత్రీకరణ.
అలాగే చెప్పడం మరిచిపోయాను మొట్టమొదటి పాట “లైలా
ఓ లైలా” పాటలో రామ్చరణ్ స్టెప్పులు బాగున్నాయి. అక్కడ అక్కడ స్టెప్పుల్లో ఎదో
కృత్రిమత్వం లా అనిపించినా బాగా చేసాడు
అని ఒప్పుకోవాలి.
రెండో హీరోయిన్ అమలా పాల్ పాపం ఎందుకు తీసుకున్నారో
ఏమిటో? ఆవిడ పాత్ర నాకు పెద్దగా అర్ధం అవ్వలేదు రెండో హాఫ్ లో ఎదో ఒకటి రెండు
పాటల్లో చూపించడానికి తప్ప.
పాపం మన బొద్దు పంజాబీ పిల్ల చార్మి బతుకు ఆఖరికి
item songs కి పరిమితం అయ్యిపోయిందన్నమాట . “యవ్వారమంటే ఎలూరే, నవ్వారు మంచం
నెల్లూరే” అన్న item song లో ఒక మెరుపు మెరిసింది...........ఇందులోనూ స్టెప్పులు
ఊపుగా ఉన్నాయి.
అక్కడెక్కడో చదివా ఇంటర్వెల్ బ్రేక్ “will be like earth shattering type” అని. build up ఇచ్చినంత సీను లేదు అక్కడ. రాం చరణ్ డబల్ ఫోటో వాడు కనబడతాడు అప్పుడు
అంతే!!
ఇంతోటి సినిమాకి కధంతా కలకత్తాలోనే తియ్యల్సిన అంత
అవసరం పెద్దగా కనబడలేదు. బహుశా ఏదైనా సెంటిమెంట్ కావచ్చు.
బ్రహ్మానందం comedy అనుకుని వెళ్ళద్దు ఇందులో అతను
పెద్దగా మెప్పించలేకపోయాడు. కానీ మన జయప్రకాష్, పోసాని కృష్ణ మురళి కనబడినప్పుడల్లా
మీరు ఖచ్చితంగా నవ్వుకుంటారు. తమన్ సంగీతం ఎలా ఉంటుందో అలాగే ఉంది.
వెళ్తే వెళ్ళండి లేదన్నా పర్వాలేదు.
Rating: 3 (2.5)/5