Showing posts with label allu arjun. Show all posts
Showing posts with label allu arjun. Show all posts

Friday, April 11, 2014

రేసు గుఱ్ఱం - సినిమా రివ్యూ

రేసు గుఱ్ఱం 

మొదటి భాగం ఒక మాదిరిగా నడుస్తుంది (బోర్ కొట్టదు).

రెండో భాగం లో సినిమా బాగా వేగం పుంజుకుంటుంది. చక చక సంఘటనలు జరిగిపోతుంటాయి. ఉన్న కాసేపు అలీ - బ్రహ్మానందం బాగా నవ్విస్తారు. 

అల్లు అర్జున్ అన్నయ్య పాత్ర దారికి 'అదేదో ఆక్సిడెంట్' అయిందని అతని ఆరోగ్యపరిస్థితి డా. అలీ వివరించే సన్నివేసం కాస్త ఎబ్బెట్టుగా (కుసిన్థ వెగటుగా) అనిపిస్తుంది, కాని హాల్లో మాత్రం నవ్వులు బాగానే పూసాయి. 

సినిమా మొత్తం అల్లు అర్జున్ చెలరేగిపోయాడు. శృతి హాసన్ ఒక దిష్టి బొమ్మలాంటి రోల్ చేసింది. కోట శ్రీనివాస రావు, ప్రకాష్త రాజ్  పాత్రలు ఎందుకో అర్ధం కాలేదు. తమన్ మ్యూజిక్  సుద్ధ వేష్టుగా అనిపించింది నాకు.

పోసాని కృష్ణ మురళి పాత్ర చిన్నదైనా చాలా నవ్వు తెప్పిస్తుంది, బావుంది. బహుశ అతనిలో మనకి ఒక కొత్త 'సీరియస్ కమెడియన్' దొరికేసాడనుకుంటాను.

మొత్తం మీద సినిమాని వెళ్లి చూసేయ్యచ్చు. దర్శకుడు సురేంద్ర రెడ్డి అతని ఇమేజ్ ని నిలబెట్టుకున్నాడు stylish టేకింగ్ తో.

రేటింగ్: 3/5

Friday, May 31, 2013

ఇద్దరమ్మాయిలతో (అల్లు అర్జున్) సినిమా రివ్యూ

మనతెలుగు సినిమాకి మంచిరోజులు వచ్చేస్తున్న సూచనలు చాలా బాగా కనబడుతున్నాయి. అవును నిజమే అండి. పెద్ద పెద్ద హీరోలవి 40 – 50 కోట్లు పెట్టి తీసే పెద్ద పెద్ద బేనర్ సినిమాలు అట్టర్ ఫ్లాప్ అయిపోతున్నాయి. ఇలా తీస్తూ పోతే కొన్నాళ్ళకి ఈ పెద్ద బేనర్లు, ఈ సోకాల్డ్  పెద్ద హీరోలు కాల గర్భం లో నష్టాలతో మట్టి కొట్టుకుపోయి కలిసిపోతారు. అప్పుడు ఆ మట్టిలోంచి మళ్ళి మామూలు మంచి సినిమాలు వస్తాయని నాకు నమ్మకం.
మీరు బాగా షార్ప్, ఇప్పటికే కనిపెట్టేసి ఉంటారు. అవును ఈ బ్లాక్ బస్టర్ “ఇద్దరమ్మాయిలతో” చాలా పరమ చెత్తగా చాలా బోరింగ్ గా ఉంది.

సినిమాలో కాస్తో కూస్తో బావున్నది అల్లు అర్జున్ నటన, ఆ కొత్తమ్మాయి కేథరిన్ తెరెసా. ఎందుకో నాకు ఈ అమ్మాయిని చూస్తున్నంత సేపు కొత్త బంగారు లోకం లో నటించిన శ్వేతా బసు ప్రసాద్ గుర్తుకు వచ్చింది. ఇంతోటి సినిమాకి అక్కడికేక్కడికో యూరప్ వెళ్లి సినిమా తియ్యవలసిన అవసరం ఏమిటో నాకైతే అర్ధం కాలేదు. బోలెడు డబ్బు ఖర్చు తప్ప. మళ్ళి ఇంతోటి సినిమాకి అన్ని అయ్యాకా మళ్ళి ఏవో కొన్ని రీషూట్ కూడా చేసారుట..!!!
ఇంక బ్రహ్మానందం ఎంత తొందరగా సినిమాలు మానేసి ఇంట్లో కూర్చుంటే అంత మంచిది. ఈ సినిమాలో అతని కామెడి చాలా విసుగొచ్చింది. ఎంత మొహమాటం గా నవ్వుదామన్నా నవ్వు రాలేదు. అలీ కూడా వేష్టే ఇందులో. ఇందులో ఈ కామెడి చాలా loud గా ఉంది అయినా కూడా అస్సలు నవ్వు తెప్పించలేకపోయింది. చాలా మంది జనం మధ్యలో అసహనానికి లోనవ్వడం మనం గమనించ వచ్చు.
చిత్ర సంగీతం నవతరానినికి నచ్చుతుందేమో? నాకు ఏ పాటా కూడా పెద్దగా చెప్పుకోదగ్గట్టు అనిపించలేదు. దేవీశ్రీ ప్రసాద్ కూడా, తమన్ లాగా అన్ని వాయిద్యాలు వేసి బాదుడు తప్ప.
ఈ మధ్య ఒక కొత్త ట్రెండ్ చూస్తున్నా – తెలుగు చిత్ర సీమలో....” సినిమా ఫుల్లు మాస్సు గురూ” అంటున్నారు. ఈ మాస్ అంటే ఏమిటో ఇందులో కొంచం నాకు అర్ధం అయ్యింది. హీరో హీరోయిన్ లు ఎంత చదువుకున్నా, ఎంత సంస్కారం ఉన్నా... తెలుగు భాషనీ కాస్త ఒక మెట్టు కిందకి దింపి మాట్లడడం అన్న మాట – “మాస్” అంటే. “లేసిపోద్ది  (లేచిపోతుంది అనడానికి), లెగు – (లేవరా అనడానికి), సచ్చిపోతావు (చచ్చిపోతావు అనడానికి). అలాగే ఈ మధ్య ప్రతీ సినిమాలో పెడుతున్నట్టే...ఇందులో కూడా పెట్టాడు దర్శకుడు.. హీరోయిన్ హీరోతో అంటుంది...”నీకు ఎప్పుడో పడిపోయాన్రా”, “నువ్వు నాకు నచ్చావు రా”, “నువ్వు వొద్దన్నా నేను నువ్వంటే పడి సస్తారా,” ఇలాంటి పదాలు తన ప్రేమని వ్యక్తీకరించడానికి ఉపయోగిస్తూ ఉంటుంది.
సినిమా మొదటి భాగం బాగా సాగాతీసినట్టు అనిపిస్తుంది... రాం చరణ్ ఆరెంజ్ లాగా మొదటి భాగం అంతా కలర్ ఫుల్ గా ఎదో అలా నడిచిపోతూ ఉంటుంది కాని ఎందుకో ఏమిటో ...... సెకండ్ హాఫ్ కాస్త బెటర్, ఎదో కాస్త కధ కదులుతుంది (నమ్మ శక్యంగా లేకపోయినా) ఎదో ఒకటి నడుస్తుంది. చివర్లో ఇద్దరు అమ్మాయిలతో ఏమి చెయ్యాలో తెలియక – కొత్తమ్మయితో ఒక డైలాగు చెప్పిస్తాడు దర్శకుడు..”ఏమోనమ్మ మీరు ఇద్దరూ కొట్టుకుని ఎప్పుడైనా విడిపోకుండా ఉనటారా? నేను మధ్యలో దూరకపోతానా? ఇది ఇక్కడితో ఆగలేదు, ఇంకా ఉంది” అంటుంది. వేచి చూడండి ఇద్దరంమాయిల పార్ట్ 2.
ఈ సినిమాలో converted brahmins – “బాప్నీస్” ట  అన్న ఒక కొత్త పదం coin చేసాడు దర్శకుడు కామెడీగా (అనుకుని). దాని అర్ధం ఏమిటో ఆ దర్శకునికి ఆయనకీ మాటలు రాసిపెట్టే కొసరు కధకుడికి మాత్రమె తెలియాలి.

సినిమా అయిపోయాకా ఆఖరున స్క్రీన్ మీద మన పూరి గారి టైటిల్ కార్డ్ వస్తుంది THANKS FOR WATCHING THIS MOVIE – PURI JAGANNADH”. అవును నిజమే, ఇంత రిస్క్ తీసుకుని ఇలాంటి సినిమాని చివరి దాకా కూర్చుని చూసినందుకు మనకి ఆ మాత్రం థాంక్స్ చెప్పద్దూ??

Thursday, August 9, 2012

జులాయి సినిమా రివ్యూ.


                                                      జులాయి సినిమా రివ్యూ.

ఈ మధ్య వచ్చే సినిమాల్లో పెద్దగా కధా, కాకరకాయా ఉండవు కాబట్టి నేను ఇప్పుడు ఈ సినిమా కధ గురించి పెద్దగా ఎమీ  ప్రస్తావించను.
మొత్తం సినిమాకి చోటా K నాయుడు/ శ్యాం K నాయుడు ఫోటోగ్రఫి ఒక పెద్ద హై లైట్ గా చెప్పుకోవాలి.
సినిమా హీరో: అల్లు అర్జున్. చాలా బాగా ఎనర్జిటిక్ గా చేసాడు సినిమాకి అతను ఒక హై లైట్ గా చెప్పుకోవచ్చు. కొన్ని పాటల్లో అతను వేసిన స్టెప్పులు చాలా కొత్తగా మంచి ఊపుని తెప్పిస్తాయి. ఇంకా ఫైట్ లు అవీ చెప్పనక్కర్లేదు.
హీరోయిన్: ఇలియానా. నాకు పెద్దగా ఎక్కడా కనబడలేదు ఈ అమ్మాయి. (అదేదో సైజు జీరో ట) జబ్బు చేసి లంఖణం చేసి లేచినట్టు ఉంది. ఒక పాటలో బావుంది అంతే. సెకండ్ హాఫ్ లో నిజంగానే కనబడదు.
విలన్: సోను సూద్. అతని లాగానే బాగా చేసాడు. కొత్తదనం పెద్దగా  కనబడలేదు.
అసలు విలన్: కోట శ్రీనివాసరావు. అలాంటి పాత్రలు కొన్ని వందలు చేసి ఉంటాడు. ఆ పాత్ర ఎక్కడో చూసినట్టే ఉంటుంది.
కామెడి: బ్రహ్మానందం – చాలా రోజుల తర్వాత కాస్త మంచి పాత్రలో ఉన్నాడు. కాస్తో కూస్తో నిడివి ఉన్న పాత్ర ఇది. ఎమ్మెస్ నారాయణ తనదైన సహజ సిద్దమైన హాస్యాన్ని పంచాడు, అక్కడక్కడ పంచ్ లతో అదరగొట్టాడు. అలీ ఒక్క మెరుపులా ఒక సీన్లో కనబడతాడు నాకైతే ఒక ఫది నిమిషాల దాకా నవ్వు ఆగలేదు. అలికి ఒక్క డైలాగు కూడా లేదు. ధర్మవరపు సుబ్రహ్మణ్యం ఒక  totally underutilized character.
దేవిశ్రీప్రసాద్ సంగీతం కుర్రకారుకి నచ్చవచ్చు.

ఇంక సినిమా గురించి వివరంగా: నా అభి ప్రాయం ఇంక త్రివిక్రమ్ - కధా, దర్శకత్వం అని పట్టుకు వేళ్ళాడకుండా తన unbeatable strong point అయిన డైలాగుల మీదే మనస్సు పెట్టి ముందుకు సాగాలి. జులాయి లో కద చాలా పేలవంగా ఉంది.అదేదో ఒక బ్యాంకు లో విలన్ అధిక వడ్డీలు ఆస చూపించి జనం చేత డబ్బు డిపాజిట్ చేయిస్తారు (తర్వాత దాన్ని దొబ్బెద్దాం  అన్న ప్లాన్ తో) జనం డబ్బు జమ చేసాకా ఆ డబ్బుని విలన్ ఒక మాస్టర్ ప్లాన్  దొంగిలిస్తాడు. ఆశ్చర్యం ఏమిటంటే ఈ electronic యుగం లో విలన్ పదిహేను వందలకోట్ల రూపాయలు - అన్ని నోట్ల కట్ల రూపంలో ఒక పెద్ద ట్రక్కు మీద వేసి తీసుకెళతాడు. వినడానికే నాకు ఏదోలా ఉంటె...చూడ్డానికి నవ్వు తెప్పించింది నాకు. ఆ ట్రక్కు డబ్బుని ఎక్కడో దాచేస్తాడు. మల్లి చివరాఖరున క్లైమాక్స్ లో ఆ లారీడు డబ్బుని మళ్ళి మోసపోయిన డిపోసిటర్ల దగ్గిరకి మన హీరో తీసుకు వస్తాడు అనుకోండి. మధ్యలో కొన్ని పంచ్ డైలోగులు, కాస్త హాయిగా నవ్వుకునే కామెడి తప్ప సినిమా రెండో భాగం చివరలో కాస్త విసుగుపుట్టిన్చినా పుట్టిన్చచ్చు.
అలాగని ఈ సినిమాని అంత వీజీ గా తీసిపడేయ్యడానికి లేదు సుమా. అల్లు అర్జున్ గురించి..........ఫోటోగ్రఫి గురించి...........కొన్ని స్టెప్పుల గురించి.............కాస్త కామెడి గురించి వెళ్లి చూసిరావచ్చు. లేదూ వద్దు అనుకుని ఊరుకున్నా పెద్దగా పోయేది ఏమి లేదు. ఇలియానా కి - కాస్త తిండి తిని మళ్ళి మునపటిలా తయారయితే తప్ప భవిష్యత్తు లేదు.