“ఏవోయ్ సుబ్బారావ్ ఓ ఫదివేలు అప్పివ్వవా? “
“మళ్ళి ఒక నెల రోజులలో ఇచ్చేస్తా! కావాలంటే వడ్డీ
తీసుకో పర్వాలేదు”
“వడ్డీ ఎంత ఇవ్వమంటావు? రూపాయి వడ్డీ ఒకే నా ?”
“పోనీ పది కుదరదా ? సరే ఒక ఫైవ్ ఇవ్వు...!!”
“నెల దాకా ఆగలేవా? సరే ఫదిహేను రోజుల్లో ఇచ్చేస్తా!!”
“వడ్డీ పెంచమంటా వా? ఎంత ఇమ్మంటావో చెప్పు?”
ఇలా అప్పు తీసుకునే వాడు చాలా ప్రాధేయ పడి అడుగుతాడు.
అప్పిచ్చే వాడు ఎన్ని కండిషన్ లు పెట్టినా దానికి తగ్గట్టు నడుచుకుని చివరకి అప్పిచ్చే
వాడి లెక్క ప్రకారమే అగ్రిమెంట్ కుదురుతుంది. ఇది మామూలు అప్పు తీసుకునే వాడి
పరిస్థితి.
**********************************************************************
అదే బ్యాంకు వాడి పరిస్థితి వేరేలా ఉంటుంది. ఒక
బ్యాంకు కి డబ్బులు కావాల్సి వచ్చి జనం దగ్గిర అప్పు తీసుకోవాలంటే పరిస్థితి
ఏమిటి? అప్పు అభ్యర్ధించే బ్యాంకు వ్యవహారం చూడండి... ;)
“మాకు అప్పు కావలెను – మా షరతులకి లోబడి మీరు మాకు
అప్పు ఇవ్వ గలరు” (Attractive deposit mobilization –
conditions apply)
1. కష్టమర్: “బ్యాంకు వారూ!! మీకు నేను ఒక నెలకి 12% చొప్పున అప్పు ఇద్దామనుకుంటున్నా తీసుకోండి
ప్లీజ్!!” (We would like to deposit some
amount for a month @12% p.a.)
బ్యాంకు: “అబ్బే లేదండి మేము కనీసం మూడు నెలలు తక్కువైతే అప్పు తీసుకోము, అదీ కూడా
ఓన్లీ 6% వడ్డీ మాత్రం ఇస్తా. కావాలంటే అప్పు ఇచ్చి వెళ్ళండి లేదంటే అక్కర్లేదు” (No sorry!! We do not
accept deposits for less than 3 months, that too with an interest of @6%p.a)
2. కష్టమర్: “నాకు
అవసరమైనప్పుడు మాత్రం నా డబ్బు
నాకిచ్చేయాలి ఆ రోజు దాకా వడ్డీతో సహా”!!
బ్యాంకు: “అబ్బే అదేమీ
కుదరదు, మీరు ఒప్పుకున్న రోజుల కంటే ముందు డబ్బు వెనక్కు ఇవ్వాలంటే ..మేము
ఒప్పుకోము!! కాదు కూడదు, అంటే మీకు ఇవాల్సిన వడ్డీ లో కొంత విరగ కోసుకుని ఇస్తాము. అలా
ఒప్పుకుంటేనే మాకు అప్పు ఇవ్వండి లేదంటే మాకు మీ అప్పు అక్కర్లేదు”.
3. కష్టమర్: “మా డబ్బు
మధ్యాన్నం కావాలి, పొద్దున్న నాకు కుదరదు, నేను ఉద్యోగం చేస్తున్నా”
బ్యాంకు: “మధ్యాన్నం
కుదరదు అండి, మీరు పొద్దున్నే వచ్చి మీ బాకీ వసూలు చేసుకోవాలి, మధ్యాన్నం మేము మా
కొట్టు కట్టేసి వెళ్లి పోతాము. మీరు ఉద్యోగం చేస్తుంటే మాకేంటి? కావాలంటే సెలవు
పెట్టుకోండి ఒక రోజు”
మచ్చుకకి కొన్ని ఇలా ఉంటాయి privileged debtor గారి విన్యాసాలు.
[This is only a jovial
attempt to explain the concept of - “Banker is a privileged debtor”]
Customer: I need 10000 Loan
ReplyDeleteNormal Lender: Okay
Customer:What is the rate of interest
Normal Lender:1 day 10rs/100
7 days 5rs/100
1 month or above 3rs/100 with agreement of your house papers.
Then customer goes to bank
Banks sees his credit record
and tells
1 day to 15 days you can use over draft facility @ 2% /month
30 days or more 12% /year.
ఫణీంద్ర గారు మీరన్నది నిజమే!! బహుశా మీరు నా బ్లాగు విషయం సరిగ్గా గమనించినట్టు లేదు. Banker is a privileged debtor - అన్న ఒక కాప్షన్ కి essay రాయాల్సి వస్తే ఎలా ఉంటుంది అన్న దానికి వ్యంగ్య తెలుగు సేత.
Deleteఇక్కడ నాకు బ్యాంకు వాడు చెడ్డ వాడు అన్న మాట అనే ఉద్దేశం ఈషణ్మాత్రం కూడా లేదు ... మీకు తెలుసో లేదు నేను 25 సంవత్సరాలు సర్వీసు పూర్తిచేసిన బ్యాంకర్ ని. :)
ఏదో మా దగ్గర డబ్బు ఎక్కువ అయి, మీకు ఇస్తే ఎక్కువ తిప్పించకుండా, ఎగ్గొట్టకుండా మళ్ళీ వెనక్కి ఇస్తారని ఇస్తుంటే మీ కండిషన్స్ కి అంతు లేకుండా పోతోంది. మొన్నామధ్య ఏదో అవసరమొచ్చి బ్యాంకుకి అప్పుకి వెళ్తే ఏభై కి వంద ఇస్తా, ఒక ఏభై తిరిగి మా బ్యాంకుకి అప్పు ఇయ్యి అన్నారు. దాని వల్ల ఆయనకి బ్యాంకు కి పేరు వస్తుంది కాబోలు.
ReplyDelete