“ఏవోయ్ సుబ్బారావ్ ఓ ఫదివేలు అప్పివ్వవా? “
“మళ్ళి ఒక నెల రోజులలో ఇచ్చేస్తా! కావాలంటే వడ్డీ
తీసుకో పర్వాలేదు”
“వడ్డీ ఎంత ఇవ్వమంటావు? రూపాయి వడ్డీ ఒకే నా ?”
“పోనీ పది కుదరదా ? సరే ఒక ఫైవ్ ఇవ్వు...!!”
“నెల దాకా ఆగలేవా? సరే ఫదిహేను రోజుల్లో ఇచ్చేస్తా!!”
“వడ్డీ పెంచమంటా వా? ఎంత ఇమ్మంటావో చెప్పు?”
ఇలా అప్పు తీసుకునే వాడు చాలా ప్రాధేయ పడి అడుగుతాడు.
అప్పిచ్చే వాడు ఎన్ని కండిషన్ లు పెట్టినా దానికి తగ్గట్టు నడుచుకుని చివరకి అప్పిచ్చే
వాడి లెక్క ప్రకారమే అగ్రిమెంట్ కుదురుతుంది. ఇది మామూలు అప్పు తీసుకునే వాడి
పరిస్థితి.
**********************************************************************
అదే బ్యాంకు వాడి పరిస్థితి వేరేలా ఉంటుంది. ఒక
బ్యాంకు కి డబ్బులు కావాల్సి వచ్చి జనం దగ్గిర అప్పు తీసుకోవాలంటే పరిస్థితి
ఏమిటి? అప్పు అభ్యర్ధించే బ్యాంకు వ్యవహారం చూడండి... ;)
“మాకు అప్పు కావలెను – మా షరతులకి లోబడి మీరు మాకు
అప్పు ఇవ్వ గలరు” (Attractive deposit mobilization –
conditions apply)
1. కష్టమర్: “బ్యాంకు వారూ!! మీకు నేను ఒక నెలకి 12% చొప్పున అప్పు ఇద్దామనుకుంటున్నా తీసుకోండి
ప్లీజ్!!” (We would like to deposit some
amount for a month @12% p.a.)
బ్యాంకు: “అబ్బే లేదండి మేము కనీసం మూడు నెలలు తక్కువైతే అప్పు తీసుకోము, అదీ కూడా
ఓన్లీ 6% వడ్డీ మాత్రం ఇస్తా. కావాలంటే అప్పు ఇచ్చి వెళ్ళండి లేదంటే అక్కర్లేదు” (No sorry!! We do not
accept deposits for less than 3 months, that too with an interest of @6%p.a)
2. కష్టమర్: “నాకు
అవసరమైనప్పుడు మాత్రం నా డబ్బు
నాకిచ్చేయాలి ఆ రోజు దాకా వడ్డీతో సహా”!!
బ్యాంకు: “అబ్బే అదేమీ
కుదరదు, మీరు ఒప్పుకున్న రోజుల కంటే ముందు డబ్బు వెనక్కు ఇవ్వాలంటే ..మేము
ఒప్పుకోము!! కాదు కూడదు, అంటే మీకు ఇవాల్సిన వడ్డీ లో కొంత విరగ కోసుకుని ఇస్తాము. అలా
ఒప్పుకుంటేనే మాకు అప్పు ఇవ్వండి లేదంటే మాకు మీ అప్పు అక్కర్లేదు”.
3. కష్టమర్: “మా డబ్బు
మధ్యాన్నం కావాలి, పొద్దున్న నాకు కుదరదు, నేను ఉద్యోగం చేస్తున్నా”
బ్యాంకు: “మధ్యాన్నం
కుదరదు అండి, మీరు పొద్దున్నే వచ్చి మీ బాకీ వసూలు చేసుకోవాలి, మధ్యాన్నం మేము మా
కొట్టు కట్టేసి వెళ్లి పోతాము. మీరు ఉద్యోగం చేస్తుంటే మాకేంటి? కావాలంటే సెలవు
పెట్టుకోండి ఒక రోజు”
మచ్చుకకి కొన్ని ఇలా ఉంటాయి privileged debtor గారి విన్యాసాలు.
[This is only a jovial
attempt to explain the concept of - “Banker is a privileged debtor”]