Friday, September 27, 2013

త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్ - అత్తారింటికి దారేది

ఒక facebook మిత్రుడు శ్రీనివాసరావు గారు అన్నట్టు, ఇప్పటిదాకా ఒక అత్తా, అల్లుడు ఇద్దరు మరదళ్ళు కధా చిత్రం అనగానే రోతపుట్టించే బూతు ద్వందార్ధాలహాస్యం గుర్తొచ్చే ఈ రోజుల్లో, అవే పాత్రలతో హాయిగా నవ్వుకునే ఒక మంచి కుటుబ కధా చిత్రం మలిచారు త్రివిక్రమ్పవన్ కలిసి.

సినిమా ఆద్యంతం పవన్ కళ్యాణ్ చాలా బావున్నాడు. చాలా చక్కటి controlled నటన కనబరిచాడు.

త్రివిక్రమ్ ‘పంచ్’ డైలాగు లు బాగా పేలతాయి. సమంత ఎదో so - so గా ఉంది. 

ఉన్నంతలో నాకు ప్రణీత కాస్త అందంగా ఉన్నట్టు అనిపించింది (సమంతతో పోలిస్తే). “దేవ దేవం భజే దివ్య ప్రభావం” అన్న పాటలో ప్రణీత చాలా నాజూకుగా, అందంగా కనబడింది. 

ఎందుకో అక్కడక్కడ సమంత పెదాలు ఎదో చీమో/ కందిరీగో  కుట్టి కాస్త వాచినట్టు ఉన్నాయి lipstick లో కవర్ చెయ్యల్సింది.  

HAMSA NANDINI
MUMTAZ
Item song (“ఓరి దేముడో దేముడో – ఎం పిల్లగాడే? మిల్లి మీటరైనా వదలకుండా దిల్లో (దిల్ లో) నిండి నాడే”)లో కనబడిన ఇద్దరు మగువలు (హంసా నందిని, ముంతాజ్) మెరుపు తీగల్లా చాలా బావున్నారు. వాళ్ళ పక్కన ఇద్దరు హీరోయిన్ లు వెల వెల పోయారు అని చెప్పవచ్చు.


కధ క్లుప్తంగా చెప్పాలంటే:
బోమన్ ఇరాని వేసిన పాత్ర ఒక అమిత కొటిశ్వరుడిది మిలన్ (ఇటలీ)లో ఉంటారు . అతనికి ఒక కొడుకు (ముకేష్ రిషి) కూతురు (నదియా), ఒక మనవడు (పవన్). తన కూతురు ఎవరో ఒక బీద లాయర్ని పెళ్లి చేసుకుందని ఇంట్లోంచి పొమ్మంటాడు (కొన్ని ఏళ్ల క్రితం). తర్వాతా తన తప్పు తెలుసుకుని పశ్చాత్తాపం తో కుమిలిపోతూ ఉండగా ఆయన మనస్సుని సంతోష పెట్టడానికి మన హీరో ఇండియా వచ్చి తన మేనత్తని ఒప్పించి తిరిగి ఇంటికి తీసుకు రావడానికి బయలుదేరతాడు.   మిగిలిన కధ మీరు ఈ పాటికి ఊహించుకుని ఉంటారు లెండి.
పవన్ వాళ్ళ అత్త ఇంట్లో ఒక డ్రైవర్ గా పనిలోకి చేరతాడు.
పవన్ assistant పాత్రలో ఎమ్మెస్ నారాయణ ‘అద్దరగొట్టాడు’. బ్రహ్మాండమైన టైమింగ్. awesome action. అలీ కూడా బావున్నాడు. సినిమాలో బ్రహ్మానందం కాస్త వేష్టు గా అనిపించాడు నాకు. ఎందుకో ఈ మధ్య ఆయన టైమింగ్ తో కాకుండా - loud comedy చేస్తున్నారు. అప్పుడు అప్పుడు కాస్త ఓవర్ గా అనిపిస్తుంది అయినా కాని బావుంది చూసేయ్యచ్చు అతన్ని. అహల్య, ఇంద్రుడు ఎపిసోడ్ లో వేరే లా అర్ధాలు వెతకక పోతే మంచి నవ్వుతెప్పించే సన్నివేశాలు ఉన్నాయి.
Fights చాల చాల నచ్చేసాయి నాకు. ‘అతను ఆరడుగుల బుల్లెట్టు’ పాట చిత్రీకరణ చాలా బావుంది (అక్కడక్కడ శ్రీను వైట్ల లా అనిపిస్తుంది).
అత్తగారి పాత్రలో - పూర్వపు హీరోయిన్ నదియా చాలా హుందాగా, అందంగా, matured గా ఉంది.
ఈ సినిమాలో చాలా పాత్రలు ఎందుకు పెట్టారో తెలియలేదు ఇలా వచ్చి అలా వెళ్ళిపోతారు: ఉదాహరణకి, కోట శ్రీనివాసరావు, ఆహుతి ప్రసాద్, బ్రహ్మాజీ, హేమ, ఇత్యాది.
“అబ్బ మీ eyebrows!! reverse లో ఉన్న Nike సింబల్ ల ఉన్నాయి”. “సింహం జూలుతో జడేయ్యకూడదురోయ్”. “పాము పరధ్యాన్నం లో ఉంది కదా అని పడగ మీద కాలేయ్యకూడదు రోయ్” ఇలా పంచ్ లు చాల చాల ఉన్నాయి ఒకటా రెండా? రేపు మళ్ళి ఇంకో సారి చూసాక బాగా గుర్తు పెట్టుకుని మళ్ళి రాస్తాను.

తప్పక ఒకసారి సకుటుంబ సపరివారం గా వెళ్లి చూసేసి హాయిగా నవ్వుకుని రావచ్చు. నాదీ హామీ.

10 comments:

  1. బ్రదర్ రివ్యూ చంపేసారు....like you :)

    ReplyDelete
    Replies
    1. థాంక్స్ అండి సుదీర్ గారు!!

      Delete
  2. 3 hours teeyalsina movie kadu.trivikram laanti creative directors kuda ilaanti worst (sreenu vaitla movies lo repeated ga vache) comedy ne nammukunte naalanti trivikra fans chala hurt avutharu. sorry

    ReplyDelete
    Replies
    1. మీతో పూర్తిగా ఏకీభవిస్తున్నా అండి. ఇది త్రివిక్రమ్ గారి సినిమా లా లేదు, కాని కాస్త టైం పాస్ కి వెళ్ళచ్చు.

      Delete
  3. only sentiment ni nammukunna intha kanna movie baaga thiyyochu. idi pawan movie avvochu leda trivikram movie avvochu kanee iddari combinatin lo vachentha movie kadu. again sorry

    ReplyDelete
    Replies
    1. మీరన్న మాట పూర్తిగా నిజం. అతడు/ జల్సా ఆ రేంజ్ లో ఉన్న సినిమా కాదు.

      Delete
  4. meekosam okati venkat garu. telugu bhasha ante abhimaanam unnapudu, bhaavanni vyaktha parichetappudu telugu padalanu viniyoginchadam nerchukunte manchidi

    ReplyDelete
    Replies
    1. చాలా ధన్యవాదాలు అండి. భవిష్యత్తులో సాధ్యమైనంతవరకు తప్పక తెలుగు పదాలు వినియోగిచడం నేర్చుకుంటాను.

      Delete
  5. Is this movie ghost directed by Seenu Vytla?

    ReplyDelete
    Replies
    1. "అదుర్స్" చూసినప్పుడు నాకూ, ఇదే అనుమానం వచ్చింది.

      Delete