శ్రీరమణ రచించిన “మిధునం” కధ ని సినిమా గా తీసిన తనికెళ్ళ ‘దశ’ భరణి గారి చిత్ర రాజములోని కొన్ని అధ్బుతమైన డైలాగులు,
నలుగురికి చెప్పి వాళ్ళని ఆ అద్భుత కళా ఖండాన్ని చూసేలా చెయ్యాలన్న తాపత్రయమే
తప్ప, ఏవో copy rights అవీ ఉల్లంఘించాలని కాదుసుమా!!!
Ø దాంపత్యమూ - ధప్పళము (గుమ్మడికాయ ముక్కల
పులుసు )....మరిగిన కొద్దీ రుచి"
Ø దొంగ బెల్లం ...దొంగ ముద్దు, అనుభవిస్తే
కాని తెలియదు"
Ø అంతే కాని ఇప్పుడు? ప్రతీ
వాడికి శంఖు చక్రాల్లా బీపీ, షుగరూ....!!!
ఎందుకు రావు?
నీళ్ళకి స్విచ్చి, నిప్పులకి స్విచ్చి, పచ్చడికి స్విచ్చి, పిండికి స్విచ్చి....ఆఖరికి ఆ స్విచ్చివేసుకోడానికి ఓపిక లేకుండా దానికి కూడా ఓ రిమోటు స్విచ్చి!!!!"
ఎందుకు రావు?
నీళ్ళకి స్విచ్చి, నిప్పులకి స్విచ్చి, పచ్చడికి స్విచ్చి, పిండికి స్విచ్చి....ఆఖరికి ఆ స్విచ్చివేసుకోడానికి ఓపిక లేకుండా దానికి కూడా ఓ రిమోటు స్విచ్చి!!!!"
Ø మనిషిగా పుట్టడం సులువేనయ్యా...కాని
మనిషిలా బ్రతకడమే కష్టం"
Ø ఒక్కడ్నో ఇద్దర్నో కంటా వనుకుని
పెద్దవాడికి కృష్ణా అని పేరు పెట్టాను...ఏడాది తిరగకుండా పుట్టుకోస్తుంటే.. ప్రతీ
సంవత్సరం పేర్ల కోసం ఎక్కడ అఘోరించడం అనీ.............ఇంకా నావల్లకాక...కేశవ
నామాలు అందుకున్నా...!!"
Ø ఊరగా............ఊరగా....ఊరగా య.
కోరగా ....కోరగా.........కొబ్బరి"
కోరగా ....కోరగా.........కొబ్బరి"
Ø కలలు కన్న దేశానికి వెళ్ళాకా ...కన్న దేశం
కలలోకి వస్తుంటుంది"
Ø " అదే మనం Air-India
flight ఎక్కామనుకోండి? మన
air-hostess కాఫీ తెచ్చేలోపు అమెరికా వచ్చేస్తుంది