"అలౌకిక ఆనందం, ప్రశాంతత" ....ఎక్కడుంది? ఎవరిస్తారు? ఎలా ఉంటుంది? సాధారణం గా అది ఎప్పుడూ మనకి కనబడదు – అది మనకి
మన పక్క వాళ్ళల్లో ఎక్కువగా కనపడుతూ
ఉంటుంది. ఎడారిలో ఎండమావిలా మనం దాన్ని వెతుకుతూ తిరుగుతూ ఉంటాం...గుళ్ళు, గోపురాలు, పూజలు, పునస్కారాలు...ఏవేవో చేస్తాం. అది మనకి దొరకదు. అదొక బ్రహ్మ పదార్ధం లా మనకి
అర్ధం అవ్వదు కూడా. అలా మన జీవితం దాన్ని వెతుక్కోడం లో అయ్యే పోతుంది. ఇంక చివరి
దశలో అన్ని ఉడిగాక ..అప్పుడు మనకి ఆ అలౌకిక ఆనందం దొరికినట్టు అనిపిస్తుంది. కాస్త
విశ్లేషిస్తే దానికి కారణం మనకి విషయం అర్ధం అవ్వచ్చు. “too many disappointments are the reason for too many expectations”. జీవిత ప్రయాణం లో మన
ఆశలు, కోరికలు అంతులేనివి వాటిని సాధించే ప్రక్రియలో మనకి కళ్ళ ఎదురుగా ఉన్న ఆనందం
కనబడదు. అలా ఎండమావి వెనక పరుగెత్తి పరుగెత్తి వయసు అయిపోయాక ఇంక ఏమి చెయ్యలేని
స్థితిలో ఉన్నప్పుడు ......ఉన్నట్టుండి మనకి జ్ఞానోదయం అవుతుంది. కోరికలే కష్టాలకి
మూలం అని. మనం మన కంటే చిన్నతరం వాళ్ళకి చెబుదాం అని ప్రయత్నిస్తాం...”ఆ మాకు
తెలుసులేవోయ్, నువ్వు నీ పని చూస్కో” అని యువతరం వాళ్ళ పనిలో వాళ్ళు
పడిపోతారు......వాళ్ళకి మళ్లి సీన్ రిపీట్. మన యవ్వనం లో మనం చేసింది అదేగా? (ఒక్క
విషయం మనం గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ కోరికలు అంటే గొంతెమ్మ కోర్కెలు అని అర్ధం)
అలాగే మనం మనసులో ఉన్న మాట నిర్భయంగా ఎదుటి వాడికి
చెప్పగలిగితే మనకి stress ఉండదు. ఎప్పుడు stress ఎదుటి వాడికి dene vaali లా ఉండాలి కాని వారినించి
lene vaali లా ఉండకూడదు. ఒక
అబద్దం చెపితే దాన్ని కవర్ చెయ్యడానికి ఒక వంద అబద్దాలు ప్లాన్ చేసుకోవాలి ..ఆ
ప్లానింగ్ లో మన సర్వ శక్తులు ఖర్చు అయిపోతాయి. మనిషికి mental stress లేకపోవడం కూడా ఒక వరం, అదే అలౌకిక ఆనందం కూడా.
నా మటుక్కు నేను హాయిగా ఉంటాను, కాని దాన్ని చూసిన
వాళ్ళు “అబ్బే వీడికి భాద్యత లేదు, he is not taking life
seriously” అంటారు. ఎందుకంటే మనం హడావిడి చెయ్యట్లేదు ఒకే విషయం మీద అస్తమాను మాట్లాడుతూ
ఉండాలి. ఊక దంపుడు ఉపన్యాసం ఇస్తూ ఉండాలి...జీవితం, బరువులు, భాద్యతలు...తొక్క
తోటకూరా ఇత్యాది అని పీకుతూ ఉండాలి. మన ప్రస్తుత సమాజం లో “you must not only be working hard, but also seem to be
working hard”, అందుకే నిజంగా వాళ్ళు ఏమి చేసినా లేకపోయినా మన చుట్టుపక్కల వాళ్ళు మనకి జీవితం
గురించి లెక్చర్లు పీకుతూనే ఉంటారు.
మనం నిన్న ఏమి మాట్లాడాం అని గుర్తుపెట్టుకోకుండా
ఉండేలా కనక, మనం మాట్లాడ గలిగితే మన జీవితం లో సగం బాధలు తీరిపోతాయి. అంతా ఆనందమే. Be good, see good, feel good – All is well
bagundi. simply clearly super
ReplyDeleteథాంక్స్ హరీష్ గారు!!!
DeleteExcellent post..
ReplyDeleteThanks Balaji garu.
DeleteNice post Rao!
DeleteThank you very much.
Deleteఇంతకి ఇది ఎవరో తెలియలేదు నాకు?
“you must not only be working hard, but also seem to be working hard”
ReplyDeleteమనం నిన్న ఏమి మాట్లాడాం అని గుర్తుపెట్టుకోకుండా ఉండేలా కనక, మనం మాట్లాడ గలిగితే మన జీవితం లో సగం బాధలు తీరిపోతాయి.
Good one Venkat garu.
చాల థాంక్స్ అండి కిశోర్ గారు........!!!
Deleteకోరికలు సహజం వెంకట్ గారు ,ఉదాహరణకు మీ బ్లాగ్ చదవాలనే కోరిక ,ఇంకా మీరు యూత్ గురించి ఒక మాట అన్నారు,
ReplyDeleteమీకు తెలుసు కదా నేను యువకుడినే ,నాకు చాల కోరికలు ఉంటాయి,ఇంకా ఎన్నో గోల్స్ ఉంటాయి,వాటిని అందుకోవాలి అనుకోడం తప్పుకాదు ,ఆ కోరికలు సహేతుకమైనవే ఐతే !
as usual నైస్ పోస్ట్ !
చాలా ధన్యవాదాలు హర్షా!!
Deleteనేను అన్నికోరికలు తప్పు అనట్లేదు. needs, desires, wants, ఇలా ప్రాధాన్యతని బట్టి రకాలు ఉన్నాయి. వాటిని మనం మన అవసరాలు, స్తోమత, వెసులుబాటుని బట్టి pursue చేస్తే మంచిదే, తప్పులేదు.
ఈ పోస్ట్ ని పేస్ బుక్ లో షేర్ చేసాను వెంకట్ గారు తప్పులేదు కదా :)
Deleteహ హ తప్పేంటండి? మరీను.
Deleteహాయిగా విచ్చల విడిగా షేర్ చేసుకోండి
ఆనందకరమయిన దీపావళి జరుపుకోవాలని కోరుకుంటూ ,దీపావళి శుభాకాంక్షలు వెంకట్ గారు ! :)
ReplyDelete