Thursday, May 10, 2012

Power Star పవన్ కళ్యాణ్ - గబ్బర్ సింగ్ – సినిమా రివ్యూ


Power Star పవన్ కళ్యాణ్ - గబ్బర్ సింగ్ – సినిమా రివ్యూ
ఖుషి, జల్సా అంత లెవల్లో కాకపోయినా పర్వాలేదు కాస్త పవన్ కళ్యాణ్ మార్కుచూసినట్టు అనిపించింది. చాల రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ చాలా చలాకిగా నటించాడు. సినిమా లో కధ అన్నది వెతకకూడదు అని మనకి అందరికి ఈ పాటికి తెలిసి ఉండాలి. కధనం చూసుకోవాలి...బోర్ కొట్టకుండా నడిపిస్తే అదే చాలు సినిమా బాగున్నట్టే.
సినిమా అంతా  పవన్ దే, పూర్తిగా దున్నేసాడు. అల్లు అర్జున్, జూనియర్ NTR ల విన్యాసాల dance లు చూసాకా ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ స్టెప్పులు చాలా హాయిగా అనిపిస్తాయి. పాటకి డాన్స్ అంటే ఒళ్ళు హూనం చేసుకోవక్కర్లేదు అన్న విషయం బాగా చూపిస్తాడు పవన్. Steps చాలా ease తో వేసాడు. స్టెప్పులు చాలా subtle గా ఉన్నాయి. అన్ని పాటలు మంచి ఊపుతో ఉంటాయి. దేవిశ్రీనా? మజాకానా? కాని సినిమా నించి బయటికి వచ్చాక ఒక్క పాటా గుర్తు ఉండదనుకోండి.

శృతి హాసన్ Iron leg అని నాకైతే confirmed గా అర్ధం అయ్యిపోయింది. ఆ అమ్మాయి ఫోటోల్లో బాగున్నంతగా సినిమాలో బాగోలేదు, మొహం ఏదో పేడి మొహం లా ఉన్నట్టుంది. సినిమా రెండో భాగం లో పవన్ తో పెళ్లయ్యాకా  ఒక పాటలో చాల బాగుంది అంతే.
ఉన్నంతలో సినిమాలో కామెడి బావుంది, పవన్, అలీ, బాగా పండించారు. అక్కడక్కడ బ్రహ్మానందం కూడా కాస్త మెరుస్తాడు కామేడిలో. మొత్తం మీద సినిమాలో బాగానే నవ్వుకుంటాం. పవన్ కళ్యాణ్ రౌడీ లతో కబడ్డీ ఆడే సన్నివేశం నవ్వుతెప్పిస్తుంది. పోలీసు స్టేషన్ లో రౌడీ లతో అంతాక్షరి ఆడడం కూడా కామెడిగా ఉంటుంది
పవన్ తల్లి కింద సుహాసిని బావుంది. సుహాసినిలో మీదకోస్తున్న వయస్సు బాగా కనబడుతుంది. కోట శ్రీనివాస రావు సో... సో.... తనికెళ్ళ భరణి పర్వాలేదు అనిపించాడు.
మలైకా అరోరా .item song పెద్దగా పేల లేదు. (Dabang లో మున్ని బద్నాం హుయి చాల బావుంది)
చివర క్లైమాక్స్ లో  fightings కాస్త బోర్ కొట్టచ్చు.
మొత్తం మీద ఒక్కసారి వెళ్ళి చూసి రండీ.......పెద్ద ఆశలు వద్దు కాని మరీ బోర్ కొట్టదు లెండి.
ఇవ్వచ్చు 3/5.  

4 comments:

  1. em bro movie gurinchi manchi ga ravayataniki pen kadaltaledu ga, nee aksharala lo telsipotundi movie hit ani

    ReplyDelete
    Replies
    1. సార్ మీకు తెలుసో తెలియదో కాని నాకు పవన్ కళ్యాణ్ సినిమాలు అంటే చాలా ఇష్టం.కాని నా వ్యక్తిగత ఇష్టం, మామూలుగా జనం అనుకునే విషయం వేరు. నేను రాసింది ఒక జనరల్ వ్యూ తో. అందుకే సూపర్ హిట్, డూపర్ హిట్ అని రాయలేదు. అయినా సినిమా హిట్ అన్న మాటకి, సినిమా బావుంది బావోలేదు అన్నదానికి తేడా ఉందని నా ఉద్దేశం.

      Delete
  2. correct ga chepparu.. cinema hit aindi.. bagundi anataniki ledu..may be pawan kalyan nunchi janalu ide asincharemo..dabaang loni flavor miss aindi..fulll focus on pawankalyan..migata charachters ni anni lite teeskunnadu movie lo (comparing to dabaang)..

    -
    Sreekanth
    Abu Dhabi

    ReplyDelete
    Replies
    1. Sreekanth garu alasyaaniki kshaminchali. Porabatulo mee message ni choodaledu, miss ayyanu.

      Thanks for the comment andi

      Delete