Friday, May 25, 2012

దరువు – సినిమా రివ్యూ


                                    దరువు – సినిమా రివ్యూ
నటీ నటులు: మాస్ మహారాజా రవితేజ, తాప్సి, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్ , సయాజీ షిండే  జయసుధ (అతిథి పాత్రలో) నవరసన నటనా సార్వ భౌమ కైకాల సత్యనారాయణ (పెద్ద యముడు), ప్రభు (అరవ హీరో) – చిన్న యముడు. ఎమ్మెస్ నారాయణ.
సినిమా మొదలయ్యి మొదలవ్వకుండా యమ లోకం సెట్టింగు, ఎమ్మెస్ నారాయణ - చిత్రగుప్తుడు అవీ చూసి – వార్నీ సినిమా అద్దిరిపోయేలా ఉంది అని ఆనందపడిపోయా. ఆ ఆననడం ఎంతో సేపు నిలబడలేదు.ఎందుకు పెట్టారో ఏమిటో.........పెద్ద యముడు ట, చిన్న యముడు ట ..పెద్దాయన చాలా పని చేసి అలిసిపోయారని  కొన్నాళ్ళు రెష్టు తీసుకోడానికి స్వర్గానికి వెళ్తూ భాద్యతలు చిన్న యముడికి అప్పజెప్పి వెళ్తాడు. చిత్రగుప్తుడు తనని స్వర్గానికి వెళ్ళకుండా చిన్న యముడు అడ్డు పడ్డాడు అన్న అక్కసుతో, చిన్న యముడికి గుణ పాఠం చెప్పడానికి అల్లరి చిల్లరగా తిరిగే రౌడి రవితేజని అతని ఆయుస్షు ఇంకా  పూర్తవకుండానే పైకి తీసుకు వచ్చేస్తాడు చిత్రగుప్తుడు. జరిగిన తప్పు సరిదిద్దుకుని దాన్ని సరిచేసే క్రమంలో చిన్న యముడు ఒక ముగ్గురు మనుషులని చూపించి ఒకరిని ఎన్నుకో మంటాడు రవితేజని (ఆ చూపిన వ్యక్తి కి ఆయుస్షు  తీరిపోయింది, ఎలాగో పోతాడు కాబట్టి – రవితేజ  మళ్లి ఆ శరీరం లోకి వెళ్ళి తన జీవితం మళ్లి జీవిన్చచ్చు అని) అలా రౌడి రవితేజ ఒక హోం మినిస్టర్ రవితేజని ఎన్నుకుంటాడు (ఈ హోం మినిస్టర్ ఒక లంచ గొండి- చెడ్డ వాడు కూడాను) ఆ తర్వాత జరిగేది సినిమా.
మొదటి భాగం అంతా రౌడి రవితేజ గొంతు చించుకుని పెద్దగా అరవడం – అంతే!! అంత కంటే ఏమి లేదు. అది కామెడీ ట. బ్రహ్మానందం డాన్స్ మేస్టార్, బృహన్నల హావ భావాలు అవి పలికిద్దాం అనుకున్నాడు, కుదరలేదు. రవితేజ చేతిలో కామెడీ పేరుతో చితక తన్నులు తినడం తప్ప నాకు బ్రహ్మానందం చేసిన కామెడీ పెద్దగా అర్ధం అవ్వలేదు. తాప్సి బావుంది. అంతకంటే ఇంకేమి లేదు చెప్పడానికి. జయసుదని ఒక ఫది నిమిషాలు చూసాను, పెద్దగా డైలాగులు లేవు, వెళ్ళిపోతుంది, మళ్లి చివర్లో వస్తుంది.
సత్యనారాయణ, ఎమ్మెస్, ప్రభు అంతా ఒక ఫది నిమిషాలు ఉన్నారు, బావున్నారు.
సంగీతం ఎవరో తెలియదు (గుర్తు లేదు కూడాను, పెద్దగా గుర్తు పెట్టుకోడానికి ఏమి లేదు).
అదేదో స్వామిజీ లా రఘుబాబు బాగా చేసాడు. అతనొక్కడే కాస్త నచ్చాడు నాకు సినిమాలో.
సెకండ్ హాఫ్ లో రవితేజ హోం మినిస్టర్ లో చేరి అన్ని మంచి పనులు చేసి ప్రజల అభిమానం పొందుతుంటాడు (మధ్య మధ్యలో అరుస్తూ కామెడి కూడా చేస్తూ ఉంటాడు).
అంత వరకే చూసాను అండి, ఇంక కూర్చోలేక వచ్చేసాను. ఏదో పాట మొదలయ్యింది ఇంక లేచి వచ్చేసా. మరి తర్వాత మళ్లి యముడు వాళ్ళు వచ్చారో లేదో? పెద్ద యముడు చిన్న యముడు ఏమయ్యారో ఏమిటో నిజంగా తెలియదు. తాప్సి తో పెళ్ళి అయ్యే ఉంటుంది చివర్లో.
నేను రవితేజ కి ఒకప్పుడు పెద్ద ఫ్యాన్ ని . కాస్త మోటుగా ఉంటుంది కాని - కామెడీ బాగా చేస్తాడు అని అనుకుంటాను. టైమింగ్ బావుంటుంది రవితేజది. అదే ఆశతో వెళ్లాను...బుక్కై పోయాను. ఇలాంటివి ఇంకో రెండో మూడో  వస్తే మనవాడు ఇంక ఇంటికే వెళ్ళేది.
పూర్తిగా సినిమా చూడలేక లేచివచ్చేసా. . . . . . . ఇంక రివ్యూ రేటింగ్ కూడా అడుగుతున్నారా నన్ను? మీరు మరీను...!!! చదివింది చాలు కాని వెళ్ళి మీ పని ఏదైనా ఉంటె చూసుకోండి అది బెటర్.

Thursday, May 10, 2012

Power Star పవన్ కళ్యాణ్ - గబ్బర్ సింగ్ – సినిమా రివ్యూ


Power Star పవన్ కళ్యాణ్ - గబ్బర్ సింగ్ – సినిమా రివ్యూ
ఖుషి, జల్సా అంత లెవల్లో కాకపోయినా పర్వాలేదు కాస్త పవన్ కళ్యాణ్ మార్కుచూసినట్టు అనిపించింది. చాల రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ చాలా చలాకిగా నటించాడు. సినిమా లో కధ అన్నది వెతకకూడదు అని మనకి అందరికి ఈ పాటికి తెలిసి ఉండాలి. కధనం చూసుకోవాలి...బోర్ కొట్టకుండా నడిపిస్తే అదే చాలు సినిమా బాగున్నట్టే.
సినిమా అంతా  పవన్ దే, పూర్తిగా దున్నేసాడు. అల్లు అర్జున్, జూనియర్ NTR ల విన్యాసాల dance లు చూసాకా ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ స్టెప్పులు చాలా హాయిగా అనిపిస్తాయి. పాటకి డాన్స్ అంటే ఒళ్ళు హూనం చేసుకోవక్కర్లేదు అన్న విషయం బాగా చూపిస్తాడు పవన్. Steps చాలా ease తో వేసాడు. స్టెప్పులు చాలా subtle గా ఉన్నాయి. అన్ని పాటలు మంచి ఊపుతో ఉంటాయి. దేవిశ్రీనా? మజాకానా? కాని సినిమా నించి బయటికి వచ్చాక ఒక్క పాటా గుర్తు ఉండదనుకోండి.

శృతి హాసన్ Iron leg అని నాకైతే confirmed గా అర్ధం అయ్యిపోయింది. ఆ అమ్మాయి ఫోటోల్లో బాగున్నంతగా సినిమాలో బాగోలేదు, మొహం ఏదో పేడి మొహం లా ఉన్నట్టుంది. సినిమా రెండో భాగం లో పవన్ తో పెళ్లయ్యాకా  ఒక పాటలో చాల బాగుంది అంతే.
ఉన్నంతలో సినిమాలో కామెడి బావుంది, పవన్, అలీ, బాగా పండించారు. అక్కడక్కడ బ్రహ్మానందం కూడా కాస్త మెరుస్తాడు కామేడిలో. మొత్తం మీద సినిమాలో బాగానే నవ్వుకుంటాం. పవన్ కళ్యాణ్ రౌడీ లతో కబడ్డీ ఆడే సన్నివేశం నవ్వుతెప్పిస్తుంది. పోలీసు స్టేషన్ లో రౌడీ లతో అంతాక్షరి ఆడడం కూడా కామెడిగా ఉంటుంది
పవన్ తల్లి కింద సుహాసిని బావుంది. సుహాసినిలో మీదకోస్తున్న వయస్సు బాగా కనబడుతుంది. కోట శ్రీనివాస రావు సో... సో.... తనికెళ్ళ భరణి పర్వాలేదు అనిపించాడు.
మలైకా అరోరా .item song పెద్దగా పేల లేదు. (Dabang లో మున్ని బద్నాం హుయి చాల బావుంది)
చివర క్లైమాక్స్ లో  fightings కాస్త బోర్ కొట్టచ్చు.
మొత్తం మీద ఒక్కసారి వెళ్ళి చూసి రండీ.......పెద్ద ఆశలు వద్దు కాని మరీ బోర్ కొట్టదు లెండి.
ఇవ్వచ్చు 3/5.