Thursday, April 5, 2012

రచ్చ - రాం చరణ్ సినిమా రివ్యూ


Raccha – Telugu Cinema Review
ఆరెంజ్ సినిమా దెబ్బై పోయినా కూడా ఇంకా మన వాడికి బుద్ధి రాలేదు అన్న మాటకి, మెగా గుడ్ ఫిల్మ్స్ వారి రచ్చ ఒక నిదర్శనం. ఆ మహాను భావుడు సంపత్ నంది (ఈ సినిమా దర్శకుడు) ఏమి సినిమా చూపించి రాం చరణ్ తేజ (ఈ సినిమా హీరో) ని ఈ సినిమాకి ఒప్పించాడో ఇంకా నాకు అర్ధం కావడం లేదు. ఎక్కడా ఇందులో ఒక చెప్పుకోదగ్గ డైలాగు కాని, సన్నివేశం కాని, కామెడి కాని మచ్చుకి కూడా కనబడవు.
రాం చరణ్ చిన్నప్పుడు పాత్ర లో వేసిన బాల నటుడ్ని సరిగ్గా భలే  వెతికి పట్టారు. అచ్చు రాం చరణ్ లాగే తేడా ముఖం పొడుగు గెడ్డం, వెర్రి నవ్వు చాలా బాగా కుదిరాయి.
వంశ పారంపర్య హీరోల బ్రతుకులు ఎలా బుగ్గి పాలు చెయ్యచ్చో ఈ రచ్చ సినిమా లో చాలా బాగా చూపించాడు మన సంపత్ నంది. అర్ధం పర్ధం లేని (కుటుంబం గురించిన ) డైలాగులు:  మా వెనక జనం ఉన్నారు, నా తండ్రి ని ఏమైనా అంటే ఊరుకోను ఇలాంటి చిల్లర డైలాగులు, నేల టిక్కెట్టు వాళ్ళ  చేత మొదటి రెండు మూడు షోల్లో ఈలలు తప్పట్లు కొట్టిన్చుకోడానికి పనికొస్తాయి, తర్వాత షోల్లో అవి కూడా ఉండవు లెండి. ఈ మూసల నించి బయట పడక పోతే మన వంశ పారంపర్య హీరో లకి భవిష్యత్తు లేదు అని  ఎంత తొందరగా గ్రహిస్తే వీళ్ళకి అంత మంచిది. లేదంటే వాళ్ళ తండ్రులు కోటీశ్వరులు, వాళ్ళ తర్వాత వీళ్ళు లక్షాధి కారులు అవుతారు అంతే.
సినిమా గురించి చెప్పుకోడానికి నాకైతే ఏమి కనబడలేదు. ఒక ఫది బోలెరో లు ఒక పాతిక మంది నల్ల సూటు రౌడీలు, నల్ల కళ్ళద్దాలు, సమయం సందర్భం లేని Fightingలు. ఎందుకు వెళ్తారో ఎక్కడికి వెళ్తున్నారో తెలియకుండా చేసింగ్ లు. ఉత్తుత్తినే బోలేరోలు గుద్దేసుకోడం, పెలిపోడం వీటినే త్రిల్ల్స్ అంటారేమో తెలియదు. కొత్తగా ఉంటుందని చైనా వాళ్ళలా కనబడే వాళ్ళతో వెదురు చెట్ల మధ్య Chinese type fightings.
అలీ కనబడిన కాస్సేపు కాస్త ఎడారిలో సేద తీరినట్టు అనిపించింది. ఇంక బ్రహ్మానందం ఇలాంటి సినిమాల్లో వెయ్యడం మానేసి ఇంట్లో కూర్చుంటే మంచిది. కోట శ్రీనివాస రావు కూడా అంతే.
సినిమా కీ టిక్కట్టు కోన డానికి పెట్టిన డబ్బుకి కాస్త ఏదైనా వసూలు అయ్యిందా అంటే? తమన్నా ఒక్కటే జవాబు. అమ్మాయి మెరుపు తీగలా ఉంది. వానా వానా వెళ్ళు వాయే పాట లో చాలా బాగుంది. డిల్లకు డిల్లకు..... పాట లో మ్యూసిక్ కోత్తగా ఉంది....బీట్ బావుంది. ఆ పాటకి ఇద్దరి స్టెప్స్ కూడా బావున్నాయి.
టైటిల్ సాంగ్ రచ్చ సాహిత్యం లో చాల కామెడి బిట్స్ ఉంటాయి ఒక్క ఉదాహరణ ఒక చరణం లో రాం చరణ్ గురించి పాడుతూ....He is a Sexy Star…………అని పాడుతారు పక్కన ఉన్న కొసరు తారలు (Extra dancers). మన గుర్రం మొహం కుర్రాడు అంత sexy  గా ఎవరికీ, ఎలా కనబడ్డాడో నాకు ఇప్పటికి అంతుబట్టని మిస్టరీ గా ఉంది పోయింది. లేదా బహుశా Sexy  అటే బాగా డబ్బున్న వాడు అన్న వేరే అర్ధం వస్తుందా? మనోడు అక్కడక్కడ హిందీ డవిలాగులు కొడతాడు – పిచ్చ కామెడిగా ఉంటుంది అప్పుడు (మన వాడి  హిందీ ఉచ్చారణ)
వీలు అవకాశం ఉన్నవాళ్ళు ఈ సినిమాని చూడకుండా తప్పించుకోండి. తప్పలేదు అనుకుంటే భరించడానికి తయారవ్వండి. మిగతాది మీ ఇష్టం.
రేటింగ్ ఎంత అంటారా ....అబ్బే 2 – 2.25 కీ మించి రావడం లేదండి.
    

3 comments:

  1. :). Ikkada oka review vinnanu bavagaru. "Rachcha" cinema Peru "ra"m "cha"ran nunchi vaste, cinema "cha"ran "te"ja la undi ani...

    ReplyDelete
  2. హహహ! అంతేలెండి మీకు అబ్బాయిలు సెక్సీగా ఎందుకు కనిపిస్తారు? తమన్నా లాంటి రిన్ సబ్బు పెట్టి తోమి బ్లూ పెట్టిన అమ్మాయిలయితే కనిపిస్తారు కాని ;) ఇక్కడ నాకేదో వాడంటే ఇష్టం అనుకోకండి! మొత్తానికి చూడాలా వద్ద అన్న ఆలోచన కూడా వేస్ట్ అంటారు!

    ReplyDelete
    Replies
    1. రసజ్ఞ గారు చెప్పా కదండీ? మరీ తప్పదు అనుకుంటే మరీ చూసేయ్యాలి అని మనస్సు పీకేస్తూ ఉంటె చూసి రండీ మరి. నేను అలాగే వెళ్ళి బుక్ అయ్యా.

      Delete