దమ్ము – సినిమా రివ్యూ
నటీ నటులు
: “తారక్” (Jr. NTR), త్రిష, కార్తిక (ఇదివరకటి
హీరోయిన్ రాధ కూతురు), కోట శ్రీనివాస రావు, బ్రహ్మానందం, అలీ, సుమన్, భానుప్రియ,
తొట్టెంపూడి వేణు (అతిథి పాత్రలో)
సంగీతం: M.M.
కీరవాణి.
దర్శకత్వం:
బోయపాటి శీను
దమ్ము సినిమా
ఒక సీదా సాదా ‘బోయపాటి మార్కు’ సినిమా. అప్పుడప్పుడు మాట మాటకి ..ఫది సుమోలు గాల్లోకి లేస్తుంటాయి,
వేట కొడవళ్ళు, కత్తులు, కటార్లు, ఒక్కగుద్దుకి పాతిక ముఫై అడుగుల ఎత్తుకు ఎగిరిపడే
fighters…..పెద్దగా మార్పు లేదు. జూనియర్ ఎన్టీయార్
కూడా అదే మూసలో పడిపోయాడు పాపం. అవే మీసాలు తిప్పడం, తొడలు కొట్టడం,
అరవడం..............అబ్బో భరించడం కష్టమే కాస్త.
కధ
మామూలుగా రెండు వంశాల మధ్య గ్రామ తగాదాలు, చంపుకోడం. కొంత వెరైటీ గా ఏడాదికి
ఒక్కసారే నరుక్కుందాం అని ఒక ఒప్పందానికి వస్తారు గ్రామా పెద్దలు. అదేదో పండగ
రెండు రోజులు నరుక్కుంటారుట డానికి రెండు
రోజుల ముందు తాంబూలాలు పుచ్చుకుంటారుట. అలా ఒక డెబ్భై ఏళ్ళ పగ అది.......మన హీరో గారు వచ్చి దాన్ని రూపుమాపుతారు అది క్లుప్తంగా కధ.
తారక్ బాగా
చిక్కి చూడ్డానికి చలాకీగా ఉన్నాడు. మీసకట్టు బాగా నప్పింది. త్రిష కి ఇంక వయసు
అయిపొయింది, బాగా ముదర ఆంటీ లా కనబడుతోంది.
ఇంక ఆవిడ నాగార్జున, వెంకటేష్ అలాంటి వాళ్ళతో నటిస్తే బావుంటుంది. సన్నగా ఉండటం
తప్ప హీరోయిన్ కి ఉండే ఆ Spark నాకు కనబడలేదు.
రెండో హీరోయిన్ కార్తిక నాజూకుగా ఉంది. ఆ అమ్మాయి బాగా పొడుగు, తారక్ కంటే బాగా
పొడుగు...కాని మొహం లో అందం గాని కళ గాని పెద్దగ నాకు కనబడలేదు, వీళ్ళిద్దరికీ
పెద్ద నటనకి ఆస్కారం లేదు, హీరో గారికి అటూ ఇటూ మీద పడటం తప్ప.
మొదటి భాగం
ఉన్నంతలో కాస్త నయం. కధనం బావుంది ఉన్నంతలో. రెండో భాగం పూర్తిగా చిరాకు
వేస్తుంది. అక్కడక్కడ సెంటిమెంటు సీన్లు బాగా తీసాడు బోయపాటి శీను, నాకు కళ్ళు
కాస్త చెమర్చాయి. పాటలన్నీ సుద్ద వేష్టు. “ప్రచండ చండ మార్తాండ తేజ..................Ruler”
అన్న పాత మాత్రం చాల బాగా తీసారు. ఈ పాటలో Costumes
/ Graphics/ Photography/ music అద్దిరాయి.
నేను
వద్దన్నా చూసే వాళ్ళు చూస్తారు, కొందరికి పొరబాటున నచ్చినా నచ్చచ్చేమో? చెప్పలేము కదా? నా వ్యక్తిగత
అభిప్రాయం, చూడక పోయిన పర్వాలేదు. ఇంక రేటింగ్ అంటారా............................2.50/5.00